Kazipet : కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో వరంగల్ అభివృద్ధి పరుగులు
అశ్వినీ వైష్ణవ్ పర్యటనతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాజీపేట యూనిట్మూడు వేల మందికి ఉపాధి అవకాశాలుKazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, నేడు ఆ కల నెరవేరబోతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (Kazipet Railway Coach Factory )పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని, ఈ యూన...