
Maitri Setu | భారత్ -బంగ్లాదేశ్ మధ్య ప్రారంభం కానున్న మైత్రి సేతు వంతెన.. ఈ భారీ బ్రిడ్జి ప్రత్యేకతేలు ఇవే..
Maitri Setu | భారత్ , బంగ్లాదేశ్‌లను కలిపే వంతెన మైత్రి సేతు ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మార్చి 2021లో మైత్రి సేతు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఫెని నదిపై 1.9 కి.మీ విస్తరించి ఉన్న ఈ వంతెన భారతదేశంలోని దక్షిణ త్రిపుర జిల్లాలో గల సబ్‌రూమ్‌ను బంగ్లాదేశ్‌లోని రామ్‌ఘర్‌తో కలుపుతుంది.అయితే “మైత్రి సేతు నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ల్యాండ్ పోర్ట్ దాదాపు సిద్ధంగా ఉంది… వంతెన మీదుగా ప్రయాణీకుల రాకపోకలు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ప్రయాణీకుల రాకపోకలు మొదలైన తర్వాత సరకు రవాణాను కూడా ప్రవేశపెట్టడానికి మరో రెండు లేదా మూడు నెలల సమయం పడుతుంది” అని త్రిపుర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి కిరణ్ గిట్టే ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారు.వంతెన ద్వారా సరుక...