నోరూరించే నీరా పానీయం రెడీ..
నెక్లెస్ రోడ్డులో రూ.13కోట్లతో నీరా కేఫ్ ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ వాసులకు కిక్కిచ్చే నీరా కేఫ్ ( Neera Cafe ) అందుబాటులోకి వచ్చింది. తాటి చెట్ల నుంచి తీసే నాన్ ఆల్కహాలిక్ పానీయాన్ని అందించే నీరా కేఫ్‌ను ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, సినిమాటోగ్రఫీ మంత్రి టి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. గీతకార్మికులను ప్రోత్సహించేందుకు రూ.13 కోట్లతో నెక్లెస్ రోడ్డు (Necklace Road) లో నిర్మించిన ఈ నీరా కేఫ్ నెక్లెస్ రోడ్‌లో ఆకర్షణీయంగా నిలిచింది.నీరా మట్టి కుండలతో ఉన్న తాటి చెట్లు ఇక్కడ కనువిందు చేస్తున్నాయి. ఒకేసారి సుమారు 300 నుంచి 500 మంది వరకు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో మాదిరిగా తాటివనాలు, ఈదుల్లో కూర్చొని కళ్లు తాగుతూ ఎంజాయ్ చేసిన అనుభూతి కలిగేలా ఈ కేఫ్ ను నిర్మించారు. తాటి, ఈత చెట్ల నమూనాల్లో సీటింగ్ అరెంజ్ చేశారు. కేఫ్ చుట్టూ తాటి చెట్లు.. వాటికి మట్టి క...