కేంద్ర మంత్రి గడ్కరీ ఎదుట రాష్ట్ర రహదారుల ప్రతిపాదనలు ఇవే.. వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం రేవంత్ విజ్ఞప్తి
New National Highways | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మాకాం వేసి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రతిపాదనల గురించి ఆయా శాఖల మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఈమేరకు బుధవారం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈసందర్భంగా తెలంగాణలో యుద్ధప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి ముందుంచారు.రీజినల్ రింగు రోడ్డు ( RRR) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్‌పూర్-భువనగిరి-చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జా...