
Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ
Future City | రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్ల (చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు 11 జిల్లాల్లో దాదాపు 10,472.71 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. HMDA నాలుగు వైపులా విస్తరిస్తుంది. ఇప్పటికే మ్యాప్ తయారీలో ఉందని అధికారులు చెబుతున్నారు. "రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని HMDA అధికార పరిధిగా నేరుగా తీసుకోలేం, ఎందుకంటే 36 గ్రామాలను HMDA నుంచి తొలగించి కొత్తగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద చేర్చారు" అని HMDA అధికారులు చెబుతునన్నారు.Future City : కనెక్టివిటీ కోసం రైలు, రోడ్డు మార్గాలునగర శివార్లలోని అనేక గ్రామాలను HMDAతో విలీనం చేయడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి గ్రేటర్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ కూడా పెరు...