Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత పథకాలు.. కొత్త ఛార్జీలతో జేబులకు చిల్లు
Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత పథకాలు రాజకీయాలను శాసిస్తున్నాయి. తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉచిత పథకాలు అమలవుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో విజయం సాధించడంలో ఇవే సహాయపడ్డాయి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు , విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం.. ఇలా రాజకీయ పార్టీలు రాష్ట్ర ఖజానాను ఆర్థిక పరిస్థితులను ఏమీ పట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒకదాని తర్వాత మరొకటి ఉచిత పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి.అయితే, ఈ ఉచిత పథకాల భారం ఖజానాపై ( financial burden) పడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంత భారీ అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి...