నస్రల్లా మరణంతో ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసిన మెహబూబా ముఫ్తీ
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హత్యను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ఈరోజు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. లెబనాన్, గాజాలోని ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.“లెబనాన్ & గాజా అమరవీరులకు ముఖ్యంగా హసన్ నసరుల్లాకు సంఘీభావంగా ఆదివారం ప్రచారాన్ని రద్దు చేస్తున్నానని, తాను పాలస్తీనా & లెబనాన్ ప్రజలకు అండగా నిలుస్తామని మెహబూబా ముఫ్తీ మె X లో ఒక పోస్ట్‌లో రాశారు.టెర్రర్ గ్రూప్‌పై తమ విజయవంతమైన దాడిని గురించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) Xలో ఒక పోస్ట్‌లో, "Hassan Nasrallah ఇకపై ప్రపంచాన్ని భయపెట్టలేరు" అని రాసింది. అయితే సెప్టెంబరు 28న హిజ్బుల్లా తన నాయకుడు, సహ వ్యవస్థాపకుడు హసన్ నస్రల్లా రోజు బీరుట్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించినట్లు హిజ్బుల్లా కూడా ధృవీకరించింది. నస్రల్లా "తన...