Thursday, November 14Latest Telugu News
Shadow

Tag: Hezbollah

Israel | హిజ్బుల్లాకు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని ఇజ్రాయెల్ ..

Israel | హిజ్బుల్లాకు ఊపిరిస‌ల‌ప‌నివ్వ‌ని ఇజ్రాయెల్ ..

International
Israel | లెబనాన్‌లో ఇరాన్-మద్దతు గల హిజ్బుల్లాపై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఈ మిలిటెంట్ గ్రూపునకు చెందిన‌ కమాండ్ సెంటర్‌లు, ఆయుధాల నిల్వ‌లు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేప‌డుతోంది. ఈ పేలుళ్లు దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాలను రెండు గంటలకు ప్ర‌భావితం చేశాయి.శనివారం అర్థరాత్రి ప్రారంభమైన బాంబు దాడి ఆదివారం వరకు కొనసాగింది. బీరుట్‌లోని షియాలు అధికంగా ఉండే శివారు ప్రాంతమైన దహియేహ్‌లోని నివాసితులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైనిక హెచ్చరికల నేపథ్యంలో బీరుట్, దాని శివార్లలో బలమైన పేలుళ్లు సంభవించాయి. దేశంలోని ప్రధాన విమానాశ్రయానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలతో సహా బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లో కనీసం ఎనిమిది దాడులు జరిగాయి. కాగా, ఈ దాడులను లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ "చాలా హింసాత్మకంగా" అభివర్ణించింది.ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌లో తన భూ కార్యకలాపాలను తీవ్రతరం చేసింది...
Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్

International
Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ టెల్ అవీవ్, జెరూసలేం ల‌పై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్య‌లో మిసైల్స్ ఆకాశం నుంచి న‌గ‌ర‌గాల‌పై ప‌డుతుండ‌గా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌ (ISRAEL ) పై దాదాపు 200 క్షిపణులను ప్రయోగించినట్లు సమాచారం. ఇజ్రాయెల్, ఇరాన్ తో పాటు దాని మిత్రదేశాల మధ్య దీర్ఘకాలిక యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. హిజ్బుల్లా నేత హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ప్ర‌త్య‌క్ష యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ తన క్షిపణి దాడి ప్రారంభించ‌డంతో ఇజ్రాయెల్ వెంట‌నే త‌మ‌ నగరాల్లో సైరన్‌లు మోగించింది.వివిధ మీడియా నివేదికల ప్రకారం, ఇజ్రా...
Israel-Iran Tension Row : కొత్త యుద్ధం ప్రారంభమైందా? ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై 100కు పైగా క్షిపణుల దాడి?

Israel-Iran Tension Row : కొత్త యుద్ధం ప్రారంభమైందా? ఇరాన్‌ ఇజ్రాయెల్‌పై 100కు పైగా క్షిపణుల దాడి?

International
Israel–Hezbollah Conflict : ఇరాన్ నుంచి మంగళవారం (అక్టోబర్ 1, 2024) రాత్రి ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది, అయితే అంతకుముందు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్ర‌ధాన‌ నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురికి తీవ్రంగా గాయాల‌యిన‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి..మంగళవారం సాయంత్రం అమెరికా దీని గురించి ముందుగానే హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా అధికారులు అలెర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు సంకేతాలు అందాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు 'AFP'కి తెలిపారు. ఈ దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మ...
Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

Hassan Nasrallah: ఇజ్రాయెల్ దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతి!

International
Israel War | లెబనాన్ రాజధాని బీరుట్‌ లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ చేప‌ట్టిన బాంబు దాడుల్లో హిజ్బుల్లా (HeZbollah) అధినేత హసన్ నస్రల్లా (Hassan Nasrallah) మృతి చెందిన‌ట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ధ్రువీకరించింది. 'ఆపరేషన్ న్యూ ఆర్డన్ మిషన్' విజయవంతమైంద‌ని ఇజ్రాయెల్ వార్ రూమ్ సైతం వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో తమ నాయకుడు నస్రల్లా (Hassan Nasrallah) మరణించాడన్న వార్తలను హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ ఇప్ప‌టివ‌ర‌కు ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి నుంచి ఆయన తమ కాంటాక్ట్‌లో లేరని, ఆయన ఎక్కడున్నారు? ఆయ‌న ఆరోగ్య పరిస్థితి గురించి తమకు తెలియదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు శుక్రవారం నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ బాంబుల వర్షం కురిపించాయి.ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లాప...
పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

International
Pager | బీరుట్: లెబనాన్‌లో టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పేజర్లు పేలిపోవడంతో   తొమ్మిది మంది మరణించగా, 2,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు (సాయంత్రం 6 గంటలకు IST) పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, దాదాపు 2,800 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు. పేజర్లు అంటే ఏమిటి? పేజర్ లేదా 'బీపర్' అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా సంక్షిప్త సందేశాలను స్వీకరించే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు పేజర్లను విస్తృతంగా ఉప‌యోగించేవారు ముఖ్యంగా వైద్యులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, యూత్ కోసం అప్ప‌ట్లో ఇది అత్యంత‌ కీలకమైన కమ్యూనికేషన్ సాధ...