Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..
Winter Season | చలికాలం వచ్చిందంటే చాలు అందరూ జలుబు బారిన పడి ఇబ్బందులు పడుతుంటారు. తక్కువ ఉష్ణోగ్రతలు, తడి వాతావరణం, ఎండ తక్కువగా ఉండడం, ఇంటి లోపల ఎక్కువ సమయం వంటి కారణాలతో వైరస్‌లు వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువ.ఇదే సమయంలో మీరు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్లమీ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచవచ్చు. ఇది అంటువ్యాధులతో పోరాడడానికి శక్తి ఇస్తుంది. చల్లని వాతావరణంలోనూ ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ శీతాకాలంలో మీరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం.
సిట్రస్ పండ్లు: విటమిన్ సి పవర్‌హౌస్‌లు
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల విషయానికి వస్తే, సిట్రస్ పండ్లు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉంటాయి. నారింజ, బత్తాయి, నిమ్మకాయలు విటమిన్ సితో నిండి ఉంటాయి, అలాగే ఉసిరి, జామ పండ్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తు...