Kanwar Yatra 2025 : యుపి ట్రాఫిక్ కోసం సూపర్ జోన్‌లు.. ఆహార భద్రత కోసం క్యూఆర్ కోడ్‌లు
Kanwar Yatra 2025 : హైందవ సంప్రదాయంలో విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో దక్షిణ భారతంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటుంటారు. అయితే ఉత్తర భారతంలో శ్రావణమాసంలో శివుని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ ఏడాది జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 09 తో ముగుస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు కన్వర్ యాత్ర చేపడతారు.శ్రావణ మాసంలో శివ భక్తులు సుదూర తీరాలలో ఉన్న గంగానది నుంచి కావిడులతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే తమ మొక్కులు నెరవేరుతాయని నమ్ముతారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు.కాగా రాబోయే కన్వర్ యాత్ర 2025 (Kanwar Yatra 2025 ) కోసం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ...