Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Ghaziabad

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Namo Bharat train: సిద్ధమైన ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్ నమో భారత్ ప్రాజెక్టు

Trending News
Namo Bharat train : ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ నమో భారత్ రైలు మార్గంలో మరో ముఖ్యమైన దశ పూర్తయ్యింది.న్యూ అశోక్ నగర్ నుండి సారాయ్ కాలే ఖాన్ వరకు విద్యుత్ సరఫరా కోసం అవసరమైన ఓవర్ హెడ్ వైర్లు (OHE) 25 వేల వోల్ట్స్ (25 kV) విద్యుత్తుతో విజయవంతంగా పనిచేసేలా చేయబడ్డాయి. దీని ద్వారా రైలు పరుగులు పెట్టేందుకు మార్గం సిద్ధమైంది.ఈ మార్గంలో 4 కిలోమీటర్ల OHE సిస్టమ్‌ను విద్యుదీకరించారు.త్వరలో ఈ మార్గంలో ట్రయల్ రన్స్ ప్రారంభం అవుతాయి. విద్యుత్ సరఫరా కోసం సారాయ్ కాలే ఖాన్‌లో ఒక ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్ ఉంది. ఇది 66kV విద్యుత్తును అందుకొని, రైళ్లకు 25kV, స్టేషన్ల అవసరాలకు 33kVగా పంపిస్తుంది.సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ ప్రత్యేకతలు:ఈ స్టేషన్ 4 రైలు మార్గాలు, 6 ప్లాట్‌ఫారమ్‌లు కలిగి ఉంది.5 ప్రవేశ/నిష్క్రమణ గేట్లు, 14 ఎలివేటర్లు, 18 ఎస్కలేటర్లు ఉన్నాయి.స్టేషన్ పొడవు 215 మీటర్లు, వెడల్పు 50 మీటర...
పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్

పూర్తి కావస్తున్న నమో భారత్ స్టేషన్ కారిడార్.. త్వరలో ట్రయల్ రన్

National
Namo Bharat station corridor  | న్యూఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌లోని అతిపెద్ద నమో భారత్ స్టేషన్, సారాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో రవాణాను సులభతరం చేసే లక్ష్యంతో ఏప్రిల్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ప్రకటన ప్రకారం, ముఖ్యమైన నిర్మాణ పనులు, విద్యుదీకరణ పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. న్యూ అశోక్ నగర్, సారాయ్ కాలే ఖాన్ మధ్య ట్రయల్ రన్స్.. మార్చి చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ప్రకారం న్యూ అశోక్ నగర్, సారాయ్ కాలే ఖాన్ స్టేషన్ల మధ్య ట్రాక్ పనులు పూర్తయ్యాయి.Namo Bharat station corridor : దీనితో ప్రయోజం ఏమిటి?ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ కారిడార్‌ను హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఢిల్లీ మెట్రో పింక్ లైన్, వీర్ హకీకత్ రాయ్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ (ISBT)తోపాటు రింగ్ రోడ్‌లతో అను...
Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు

Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం క‌లిపిన వ్య‌క్తి.. చిత‌క‌బాదిన స్థానికులు

Viral
Ghaziabad : ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలిపాడు. మూత్రం ఉన్న లీటర్‌ బాటిల్‌ ఆ షాపు వద్ద క‌నిపించింది. దీనిని చూసిన స్థానికులు స‌ద‌రు షాపు య‌జ‌మానిని నిలదీసి దాడిచేశారు. అనంత‌రం పోలీసులకు అప్ప‌గించి ఫిర్యాదు చేయ‌డంతో ఫ్రూట్‌ జ్యూస్‌ షాపు యాజమానిని అరెస్ట్‌ చేశారు. షాపులోని యూరిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్‌, వివిధ‌ పండ్ల రసాల్లో మూత్రం కలిపి (Mixing Urine with Juice) విక్ర‌యిస్తున్నాడు. సెప్టెంబర్ 13న బాటిల్‌లో ఉన్న పసుపు రంగు ద్రవాన్ని ఫ్రూట్‌ జ్యూస్‌లో అతడు కలపడాన్ని కొందరు ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఆ బాటిల్‌ను పరిశీలించగా అది యూరిన్ అని స్ప‌ష్ట‌మైంది. దీంతో కంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.కాగా, జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న అమీర్ ఖాన...
Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత

Bulldozer action | ఆలయం సమీపంలోని మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరా.. నిందితుడి ఇల్లు కూల్చివేత

National
Bulldozer action | ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో మహిళల బాత్‌రూమ్‌లో సీసీటీవీ కెమెరాను అమర్చినందుకు మహంత్ ముఖేష్ గోస్వామి అనే ఆలయ పూజారిపై అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. CCTV, దాని DVRలో 320 మంది మహిళలు, బాలికలకు సంబంధించిన రికార్డింగ్ వీడియోలు ఉన్నాయి.డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రూరల్) వివేక్ చంద్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాత్‌రూమ్‌లో సీసీటీవీ, దానికి సంబంధించిన‌ డీవీఆర్ ను గుర్తించామని, DVRలో ఐదు రోజుల డేటా ఉంది. సీసీటీవీ ఫుటేజీని ప్రత్యక్షంగా ప్రదర్శించిన నిందితుడు మహంత్ గోస్వామి సెల్‌ఫోన్‌ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతని అరెస్టు కోసం రెండు పోలీసు బృందాలను మోహరించారు. అతను ముందస్తు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు.ఇదిలా ఉండగా, బుల్‌డోజర్‌ చర్య...
భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

భారతదేశపు మొట్టమొదటి, వేగవంతమైన రైల్ RAPIDX Train వస్తోంది..

Trending News
దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో అనతికాలంలోనే విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వందే భారత్‌ సెమీ హైస్పీడ్ రైళ్లు వచ్చిన కొద్దిరోజుల్లోనే సూపర్ సక్సెస్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మధ్యతరగతి ప్రయాణికుల కోసం వందేభారత్ సాధారణ్ పేరుతో స్లీపర్ కోచ్ లతో రైళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా మరో మరో కీలక ప్రాజెక్టును జాతికి అంకితం చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఎన్‌సిఆర్‌(Delhi-NCR)లో భారతదేశపు మొట్టమొదటి అత్యంత వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థ ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌ (RAPIDX Train)ను ప్రధాని నరేంద్రమోదీ వచ్చే వారం ప్రారంభించనున్నారు. నవరాత్రి పర్వదినాల్లోనే పట్టాలెక్కనున్న ఈ ట్రైన్‌ను పూర్తిగా మహిళలు నడపనుండటం విశేషం. పూర్తిగా మహిళా పైలట్లే.. దేశంలోనే మహిళా పైలట్లతో ప్రారంభోత్సవం జరుపుకుంటున్న తొలి ర్యాపిడ్ ఎక్స్ ట్రైన్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దేశ రాజధానిలో...
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. రూ.2 కోట్లకు పైగా విలువైన బంగారు, వజ్రాభరణాలు స్వాధీనం

Crime, National
వరంగల్: అపార్ట్ మెంట్లలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలతోపాటు గంజాయిని విక్రయిస్తున్న నలుగురు సభ్యు లు గల ఘజియాబాద్ అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్, మట్టెవాడ, సుబేదారి, హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2కోట్లు విలువైన 2కిలోల 380 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు, రూ.5.20 లక్షల విలువైన 14 గంజాయి ప్యాకెట్లు, పిస్టల్, కారు, నాలుగు సెల్ ఫోన్లు, రెండు వాకీటాకీలు, నాలుగు నకిలీ ఆధార్ కార్డులు రూ.5వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో అక్బర్ ఖురేషి(ఘజియాబాద్,ఉత్తరప్రదేశ్), కపిల్ జాటోవు (మీరట్), మహ్మద్ షరీఫ్ (ఘజియాబాద్), ఎండి జాద్ ఖాన్(ఘజియాబాద్) ఉన్నారు. అరెస్టు వివరాలను వరం గల్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 5న వరంగల్ మట్టెవాడ, హన్మకొండ, సుబేదారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని అపార్ట్ మెంట్లో తాళం వేసిన ఉన్న 8 ఇళ్లలో పెద్ద మొత్తంలో బంగారు, వెండి ఆ...
ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

Crime
ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది. ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు. కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే "నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను" అని రాసి ఉంది. బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు. గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థల...
విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

విషాదం : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Crime
ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఘజియాబాద్‌లోని క్రాసింగ్ రిపబ్లిక్ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రహదారిపై రాంగ్ రూట్ లో వస్తున్న స్కూల్ బస్సును కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా మీరట్‌లో నివాసం ఉంటున్నారు. ఎస్‌యూవీలో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై రాంగ్ సైడ్ లో నడుపుతున్న స్కూల్ బస్సు డ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతనిని విచారిస్తున్నామని, కఠినమైన సెక్షన్లతో కేసు నమోదు చేస్తున్నామని డిప్యూటీ పోలీస్ కమిషనర్ దేహత్ శుభమ్ పటేల్ చెప్పారు.  " వాహనాలు ఢీకొన్న ప్రభావం చాలా బలంగా ఉంది, కారు తలుపులను  కత్తిర...