
Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!
Food Trends | హైదరాబాదీలకు బిర్యానీకి ఉన్న బంధం విడదీయరానిది. 2024లో హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ తన వార్షిక నివేదిక (Swiggy annual food trends 2024)లో నివేదికలో వెల్లడించింది.వార్షిక ఫుడ్ ట్రెండ్, హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ చేయబడతాయని ఇండియా స్విగ్గీ సూచించింది. 97.21 లక్షల ప్లేట్‌ల ఆర్డర్లతో చికెన్ బిర్యానీ(Chicken biryani)కి అత్యంత డిమాండ్ ఉన్న రెసిపీగా నిలిచింది. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డర్లు వచ్చాని స్విగ్గీ పేర్కొంది.ఒక హైదరాబాదీ ఆహార ప్రియుడు ఏకంగా 60 బిర్యానీలను ఆర్డర్ చేయడానికి రూ. 18,840 వెచ్చించగా, మొదటిసారి స్విగ్గీ యూజర్లు సంవత్సరంలో 4,46,000 చికెన్ బిర్యానీల(hyderabadi biryani) ను ఆర్డర్ చేయడం ద్వారా డిష్‌ను స్వీకరించారని నివేదిక పేర్కొంది. T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, హ...