
GST తగ్గింపుతో టీవీలు, ACలపై ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?
న్యూఢిల్లీ: పండుగ సీజన్ కు ముందు జీఎస్టీ కౌన్సిల్ (GST Council) తన 56వ సమావేశంలో జీఎస్టీలను భారీగా తగ్గించింది. సెప్టెంబర్ 22, 2025 నుండి కొత్త జీఎస్టీ శ్లాబ్‌లు అమలులోకి వస్తాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించారు. ఫలితంగా, గతంలో 28 శాతం పన్ను విధించిన అనేక సాధారణ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల (Electronics) పై ఇప్పుడు 18 శాతం శ్లాబ్ పరిధిలోకి రానున్నాయి. అలాగే 12 శాతం ఉన్నవి ఇకపై 5 శాతం శ్లాబులోకి మార్చనున్నారు. అంతేకాకుండా కొన్ని ఉత్పత్తులకు జీఎస్టీ పూర్తిగా తొలగించారు.ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీ తగ్గింపుACలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై GST 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. మీరు ఆశించే పొదుపుల వివరాలు ఇక్కడ ఉన్నాయి:ACలపై పొదుపులు:గతంలో, రూ.30,000 ధర గల 1-టన్ను AC పై 28 శాతం GST ఉంటే రూ.8,4...