Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: Encounter

Bahraich Violence | భరూచ్‌ నిందితుల్లో.. ఇద్దరిపై పోలీస్‌ కాల్పులు
Crime

Bahraich Violence | భరూచ్‌ నిందితుల్లో.. ఇద్దరిపై పోలీస్‌ కాల్పులు

Bahraich Violence : భరూచ్‌ హింసాకాండ నిందితులు నేపాల్‌ పారిపోయేందుకు యత్నించ‌గా వారిని పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని భరూచ్‌లో అక్టోబరు 13న దుర్గా విగ్రహం నిమజ్జనం ఊరేగింపు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం గుండా వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో హింస చెలరేగింది. దుండ‌గులు 22 ఏళ్ల రామ్ గోపాల్ మిశ్రాను అత్యంత దారుణంగా కాల్చి చంపడంతో హింస చెలరేగింది. ఈ ఘట‌న‌లో పొలీసులు ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేయ‌గా 55 మంది అనుమానితులను అరెస్టు చేశారు.కాగా, రామ్ గోపాల్‌ మిశ్రాను కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్ కుమారులు, హత్య కేసులో నిందితులైన సర్ఫరాజ్, ఫహీమ్ నేపాల్‌ పారిపోయేందుకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్ర‌మంలో వారిని పట్ట...
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?
తాజా వార్తలు

ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోలు హతం..?

Chhattisgarh : చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం అబూజ్‌మడ్‌‌లో తుపాకుల మోతలు దద్దరిల్లాయి. ఛత్తీస్‌గఢ్‌‌ (Chhattisgarh) అడవుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బస్తర్ రేంజ్‌లోని నారాయణ్‌పుర్‌- దంతెవాడ సరిహద్దు అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎన్ కౌంటర్ కలకలం రేపింది. మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారు 36 మంది మావోలు మృతిచెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు.చత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ, నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతమైన అబూజ్‌మడ్‌‌లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో మధ్యాహ్నం వేళ  భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఇరువర్గాలు భీకరంగా పోరాడాయి. కాగా ఈ ఎదురు క...
Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి
Crime

Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర‌ చ‌రిత్ర‌లోనే అతిపెద్ద‌ ఎన్ కౌంట‌ర్‌.. 29 మంది నక్సల్స్‌ మృతి

Chhattisgarh Encounter | ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో సుమారు 40 మంది మావోయిస్టులు మృతిచెందార‌ని అనధికారిక వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటి వరకు 29 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదేనని పోలీసులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజుల్లో తొలిద‌శ‌ లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమ‌వుతున్న క్ర‌మంలోనే ఇంత‌టి భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే బస్తర్‌ రీజియన్‌లో వ‌రుస ఎన్‌కౌంటర్లలో 79 మంది మావోయిస్టులు మరణించారు.ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృ...