Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు
16వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ చేతులమీదుగా నియామక పత్రాల పంపిణీRozgar Mela : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా యవతకు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామకం పొందిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని PMO శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.16వ రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్త ఉద్యోగులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాలు, మంత్రిత్వ శాఖలలో చేరనున్నట్లు ప్రకటనలో తెలిపింది.ఉపాధి కల్పనకు అత్యధిక...