Friday, January 3Thank you for visiting

Tag: ELECTION 2024

Maharashtra Elections | మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకే సింహభాగం.. ఏకంగా 148 స్థానాల్లో పోటీ..

Maharashtra Elections | మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకే సింహభాగం.. ఏకంగా 148 స్థానాల్లో పోటీ..

Elections
Maharashtra Elections 2024 : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024: అధికార భారతీయ జనతా పార్టీ (BJP) మహారాష్ట్రలోని 148 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిత్ర పక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేస్తోంది.మంగళవారం ప్రక్రియ ముగిసే సమయానికి మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు అధికార మహాయతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)తో సహా దాదాపు 8,000 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 80 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ నవంబర్ 20న జరిగే ఎన్నికలకు 53 మంది అభ్యర్థులను నామినేట్ చేసింది. రెండు సెగ్మెంట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోని మహాయుతి.. మిత్రపక్షాలకు ఐదు సీట్లు ఇచ్చారు. మరోవైపు ఎంవీఏలో కాంగ్రెస్ 103 స్థానాల్లో పోటీ చేయగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) 89, శరద్ పవార్ ఎన...
Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Phase 7 Elections Key candidates లోక్ సభ ఎన్నికల ఫేజ్ 7: కీలక అభ్యర్థులు, నియోజకవర్గాల జాబితా..

Elections
Lok Sabha Election 2024 (Key candidates) :  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఏడవ, చివరి విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది. 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ , హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, చండీగఢ్ కేంద్ర పాలిత నియోజకవర్గాలు ఏడో దశ ఎన్నికల బరిలో ఉన్నాయి. ఏడవ దశలో పోలింగ్ జరిగే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 1) బీహార్: 40 సీట్లలో 8 2) హిమాచల్ ప్రదేశ్: 4 3) జార్ఖండ్: 14 నియోజకవర్గాలలో 3 4) ఒడిశా: 21 స్థానాలకు 6 5) పంజాబ్: 13 సీట్లలో 13 6) ఉత్తరప్రదేశ్: 80 నియోజకవర్గాలలో 13 7) పశ్చిమ బెంగాల్: 42 స్థానాలకు 9 8) చండీగఢ్: 1 రాష్ట్రాల వారీగా ఏడో దశ నియోజకవర్గాల జాబితా: 1) బీహార్ నలంద (జ‌న‌ర‌ల్ ) పాట్నా సాహిబ్(జ‌న‌ర‌ల్ ) పాటలీపుత్ర (జ‌న‌ర‌ల్) అర్రా (జ‌న‌ర‌ల్)బక్సర్ (జ‌న‌ర‌ల్) ససారం (SC) కరకత్ (జ‌న‌ర‌ల్) జహనాబాద్ (జ‌న‌ర‌ల...
PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ..  బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌

PM Modi: సీఏఏ ర‌ద్దు చేయ‌డం ఎవ‌రి వల్లా కాదు.. ప్రధాని మోదీ.. బెంగాల్‌లో ప్రధానికి ఊహించని గిఫ్ట్‌

Elections
కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సీట్లు వారి యువరాజు వయస్సును మించవు PM Modi On CAA | కోల్ క‌తా : తాను ఉన్నంత వరకు ‘సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్ (CAA ) ’ను రద్దు చేయడం ఎవరివల్లా కాదని ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ (PM Modi) స్ప‌ష్టం చేశారు. ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) పార్టీపై ఆయ‌న‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై కూడా సెటైర్‌లు వేశారు. ఈరోజు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాస్ జిల్లా బరాక్‌పూర్‌లో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్ర‌ధాని ప్రసంగించారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందన్నారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali ) లో తృణ‌మూల్ కాంగ్రెస్ నేతల చేతిలో అత్యాచారాలకు గురైన బాధిత మహిళలను టీఎంసీ (TMC) గూండాలు బెదిరిస్తున్నారని మోదీ మండిపడ్డారు. ఒక‌వైపు బాధితులను వేధిస్తూనే మ‌రోవైపు షాజహాన్‌ షేక్ వ...
Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Elections
Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ వంటి కొన్ని ప్రధాన రాష్ట్రాలు ఉన్నాయి. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. నాలుగో దశ ఎన్నికల్లో నియోజకవర్గాలు ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగ...
lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

Elections
Amethi | ఉత్తరప్రదేశ్‌లోని 2019లో బీజేపీ చేతతో ఓడిపోయే వ‌ర‌కు గాంధీ కుటుంబానికి బలమైన కంచుకోటగా అమేథీ ఉండేది. చేజారిపోయిన అమేథీని తిరిగి పొందేందుకు రాహుల్ గాంధీ మ‌రోసారి పోటీ చేస్తార‌ని ఆయన మద్దతుదారులు ఊహించగా, కాంగ్రెస్ అధిష్టానం మాత్రం గాంధీయేతర వ్య‌క్తిని ఎంచుకుంది.గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడైన కిషోర్‌ లాల్ శర్మ ఈసారి అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మూడు దశాబ్దాలలో కనీసం నలుగురు గాంధీ కుటుంబ సభ్యులు వేర్వేరు సమయాల్లో పోటీ చేయ‌గా 26 సంవత్స‌రాల తర్వాత రెండవ గాంధీయేతర కాంగ్రెస్ అభ్యర్థిగా కిశోర్ లాల్ శ‌ర్మ నిలిచారు. ఈ స్థానం నుంచి గాంధీయేతర అభ్యర్థి సతీష్ శర్మ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఖాళీ అయిన తర్వాత రెండుసార్లు విజయం సాధించారు. కానీ 1998 ఎన్నికల్లో ఓటమి చ‌విచూశారు. కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక పోరు అమేథీ (Amethi) కాంగ్రెస్‌కు లోక్‌సభ నియోజకవర్గం ఎంతో ప...
Rahul Gandhi : వీడిన సస్పెన్స్..  రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ

Rahul Gandhi : వీడిన సస్పెన్స్.. రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిశోరీ లాల్ శర్మ

Elections
Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి రెండు బలమైన స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఎవ‌ర‌నే దానిపై నెలరోజుల ఊహాగానాలకు ఎట్ట‌కేల‌కు ముగింపు పలికింది. రాయ్‌బరేలీ (Raebareli) నుంచి రాహుల్ గాంధీ పేరు ను పార్టీ ప్రకటించింది. అదే సమయంలో గాంధీల కుటుంబానికి మొదటి నుంచి వీరవిధేయుడైన కిషోరి లాల్ శర్మ(Kishor lal Sharma) అమేథీ (Amethi) నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ మే 3. కాగా ఈ రాయ్‌బరేలీ అమేథీలకు మే 20న 5వ దశలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలు అయిన తర్వాత, రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయింది. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ పార్లమెంటు సభ్యుడి ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీకి చెందిన దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాయ్‌బరేలీ ...
Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Third Phase Voting : మూడో దశలో 1,352 మంది అభ్యర్థుల్లో 392 మంది ‘కోటీశ్వరులు.. 8 శాతం మందిపై క్రిమినల్ కేసులు

Elections
Third Phase Voting : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు బ‌రిలో నిలిచారు. వీరిలో 29 శాతం అంటే 392 మంది 'కోటీశ్వరులే..! ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తులు రూ. 5.66 కోట్లు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR), షనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్ర‌కారం.. మూడవ దశలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల్లో మొదటి ముగ్గురు అభ్యర్థులు, వారి ప్రకటించిన ఆస్తుల ఆధారంగా, వందల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. అత్యధికంగా ప్రకటించిన ఆస్తులు రూ. 1,361 కోట్లు దాటాయి. కాగా మే 7న మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి . ADR నివేదిక ప్రకారం.. మూడవ దశ లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న 1,352 మంది అభ్యర్థులలో కేవ‌లం 123 మంది (9 శాతం ) మాత్రమే మహిళలు ఉన్నారు. 18 శాతం మందిపై క్రిమినల్ కేసులు లోక్‌సభ ఎన్నికల మూడో విడత (Third Phase Voting ) లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటిం...
Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Election 2024 | రాయ్ బ‌రేలి నుంచి రాహుల్ పోటీ?

Elections
Rae Bareli : కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఇంకా తేల్చుకోలేదు. ఆ పార్టీ కంచుకోట‌లుగా చెప్పుకునే రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల అభ్య‌ర్థ‌ల ఎంపిక‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేక‌పోతోంది పార్టీ నాయ‌కత్వం. ఈ కీల‌క‌మైన రెండు స్థానాల్లో నామినేషన్లు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ ఇంకా కొనసాగుతుండగా, ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయకపోవచ్చని, రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీని కాంగ్రెస్ బరిలోకి దించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాహుల్ అమేథీ (Amethi) నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆ సీటులో కాంగ్రెస్ దివంగత నేత షీలా కౌల్ మనవడిని పార్టీ బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ కోడలు అయిన షీలా కౌల్ ఐదుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా, కేంద్ర మంత్రిగా ప...
కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

కర్ణాట‌క‌లోశాంతిభ‌ద్ర‌త‌ల‌పై దేశం ఆందోళ‌న చెందుతోంది.. విద్యార్థిని హత్యపై ప్రధాని మోదీ

Elections, National
Hubballi murder case | హుబ్బళ్లి హత్య ఘటనపై సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుప‌డ్డారు. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై యావత్ దేశం ఆందోళన చెందుతోందని, రాష్ట్రాన్ని నాశనం చేయాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుందని అన్నారు. ఉత్తర కన్నడలో ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ఒక కుమార్తెకు ఏమైందోనని యావత్ దేశం ఆందోళన చెందుతోంది. కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు. తమ కుమార్తెల ఏమ‌వుతారోనని తల్లిదండ్రులు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. "కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను నాశనం చేసే పనిలో నిమగ్నమై ఉంది. నేరాలను నియంత్రించే బదులు, కాంగ్రెస్ వ్యతిరేక, దేశ వ్యతిరేక ఆలోచనా ధోరణిని ప్రోత్సహిస్తోంది" అని ప్రధాని అన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తె నేహా(23) ఏప్రిల్‌ 18న బీవీబీ కాల...
Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..

Elections 2024 | లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజ‌యం..

Elections
Surat Lok Sabha | 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూర‌త్ లోక్‌స‌భ (Surat Lok sabha) నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థి ముఖేశ్ ద‌లాళ్‌ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు పోలింగ్ అధికారి ప్ర‌క‌టించారు. ముఖేశ్ కుమార్ చంద్ర‌కాంత్ ద‌లాళ్ బీజేపీ నుంచి బ‌రిలో నిలిచారు. అయితే సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి ఆయ‌న‌ విజ‌యం సాధించార‌ని ప్ర‌క‌టిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్, ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్ సౌర‌భ్ పార్ది తెలిపారు. ఈమేర‌కు ద‌లాళ్‌కు ధ్రువీక‌ర‌ణ ప్ర‌త్రాన్ని కూడా అంద‌జేశారు.కాగా సూర‌త్ లోక్ స‌భ స్థానం నుంచి నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులద‌రూ పోటీ నుంచి త‌ప్పుకున్నట్లు గుజ‌రాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేష‌న్లు ఉప‌సంహ‌రించుకునేందుకు మంగ‌ళ‌వారమే చివ‌రి తేదీ. సూర‌త్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీ...