
వచ్చే నెల నుంచే వందే భారత్ స్లీపర్ రైలు.. మొదటిసారి ఈ రూట్లోనే
Vande Bharat Sleeper | భారతీయ రైల్వే.. 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు సక్సెస్ ఫుల్ గా వంద శాతం ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. అదే ఉత్సాహంతో రైల్వేశాఖ అత్యాధునిక సౌకర్యాతో వందేభారత్ స్లీపర్ కోచ్ రైలును తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ రైలును వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో రైలు సిద్ధమైంది. 2024 మార్చి నుంచి ఏప్రిల్ మధ్య ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి.వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది, వందేభారత్ స్లీపర్ రైలు ఇతర హైస్పీడ్ రైళ్లకంటే మెరుగైన ఫీచర్లు, వేగం కలిగి ఉంటుంది. సుదూర నగరాలను మధ్య ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని అధ...