Friday, April 11Welcome to Vandebhaarath

Tag: Crop Loan

Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న‌ రుణాలకు కటాఫ్‌ డేట్‌..
National, Telangana

Rythu Runa Mafi | రైతు రుణమాఫీకి నిబంధన.. రూ.2 లక్షలకు పైగా ఉన్న‌ రుణాలకు కటాఫ్‌ డేట్‌..

Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామ‌ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న‌ రుణాన్ని చెల్లించిన తర్వాతే మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్‌లో ఆయ‌న‌ మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్‌కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్‌కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేదానిలో వాస్త‌వం లేద‌ని స్పష్టంచేశారు.ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ (Runa Mafi) చేసిన‌ట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెల‌, లేదా రెండు నెలల్లో కటాఫ్‌ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ...
Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం
Telangana

Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం

Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత‌ బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్ల‌డించారు.రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవే...
Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..
Telangana

Crop Loan | మూడు విడతలుగా రైతు రుణమాఫీ.. నేడే రైతుల ఖాతాల్లో నగదు..

Crop Loan | హైదరాబాద్‌ ‌: కొన్ని నెల‌లుగా ఎదురుచూస్తున్ రుణ‌మాఫీ ప‌థ‌కం (Rythu Runa Mafi) ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్కింది. ఈ పథకంలో భాగంగా ఈరోజు గురువారం సాయంత్రంలోపు రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు న‌గ‌దు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై బ్యాంకర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల స‌మ‌యంలో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చిన విష‌యం తెలిసిందే.. ‌దానిని అమలు చేసే దిశగా నేడు తొలి అడుగు వేయనుంది. ఈనెల 18న రూ.లక్షలోపు రుణాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి నేరుగా ఆ మొత్తం జమ కానుంది. రేష‌న్ కార్డు లేని రైతుల‌కు.. అయితే రాష్ట్రంలో 90 లక్షల రేషన్‌కార్డులు ఉండగా..70 లక్షల మంది రైతులకు రుణాలు (crop loan waiver) ఉన్నాయి. వీరిలో 6.36 లక్షల మందికి రేషన్‌ ‌కార్డులు లేవు. ఈ విషయమై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో గ‌త మంగ‌ళ‌వారం కలెక్...