Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా
Valmiki corporation scam | కర్ణాటకలో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం మొదటి నుంచి మంత్రి బి. నాగేంద్ర రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేశాయి. దీంతో నాగేంద్ర మంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటానికి నాగేంద్ర రాజీనామా చేశారని పేర్కొన్నారు. మే 26న కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (కెఎమ్‌విఎస్‌టిడిసి) సూపరింటెండెంట్ చంద్రశేఖరన్ విషాదకరమైన ఆత్మహత్య తర్వాత ప్రతిపక్ష బిజెపి ముప్పేట దాడి చేసింది.చంద్రశేఖరన్ మృతితో కార్పొరేషన్ పరిధిలోని నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అక్రమంగా నిధుల బదిలీ చేసేందుకు సీనియర్ అధికారులు...