Saturday, September 13Thank you for visiting

Tag: Congress Govt

LRS Applications | మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్..  ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

LRS Applications | మూడు నెలల్లోగా ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల క్లియరెన్స్.. ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు

Telangana
LRS Applications | రాష్ట్రంలో ఎల్ ఆర్ ఎస్ ద‌ర‌ఖాస్తుల గురించి వేచిచూస్తున్న ప్ర‌జ‌లకు ఊర‌ట‌నిచ్చేలా తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 2020లో ప్రకటించిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కింద దరఖాస్తులను క్లియర్ చేసే ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ ప‌రిష్క‌రించేందుకు, అలాగే అక్రమ క్రమబద్ధీకరణకు ఆగస్ట్‌ మొదటి వారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. మూడు దశల్లో ప్రక్రియ.. ప్లాట్ల దరఖాస్తుల పరిశీలనను మూడు దశల్లో చేప‌ట్ట‌నున్నారు. అలాగే లేఅవుట్ల దరఖాస్తుల పరిశీలనను నాలుగు దశల్లో పూర్తి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ సమస్యల కారణంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సుమారు 25 లక్షల దరఖాస్తులను క్రమబద్ధీకరించడానికి నిర్ణీత రుసు...
Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మ‌హిళ‌ల లీల‌లు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)

Free Bus For Woman | ఫ్రీ బస్సుల్లో మ‌హిళ‌ల లీల‌లు.. ఎంచక్కా పళ్లు తోముతూ.. ఎల్లిపాయ పొట్టు తీస్తూ.. (వీడియో)

Viral
హైదరాబాద్ : కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ప‌థ‌కం ((Free Bus For Woman) ) .. చాలా మందికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మారింది. బ‌స్సుల్లో మ‌హిళా ప్ర‌యాణికుల సంఖ్య భారీగా పెగిరిపోయింది. 100 శాతం కంటే ఎక్కువ‌ ఆక్యుపెన్సీతో టిజి ఆర్టీసీ బ‌స్సులు కిక్కిరిసిపోతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఉచిత బ‌స్సులో ప్ర‌యాణిస్తున్న కొంద‌రు మ‌హిళ‌లు చేస్తున్న పిచ్చిప‌నులు ప్ర‌జ‌ల‌కు తీవ్ర అసౌక‌ర్యానికి గుర్తిచేస్తున్నాయి. సీటు కోసం మ‌హిళ‌లు కొట్టుకోవ‌డం త‌ర‌చూ చూస్తున్నాం. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే మ‌హిళ‌ల‌తోపాటు పురుషులు ప‌డుతున్న క‌ష్టాలు అన్నీఇన్నీ కావుFree Bus For Woman అయితే ఎలాగూ టికెట్‌ లేకుండా ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని కొద‌రు మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు...
Raitu RunaMafi |  తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

Telangana
Telangana: రైతులు ఎంతో కాలంగా ఎదురు చూసిన రైతు రుణమాఫీ ప‌థ‌కాన్ని(Raitu RunaMafi) ) కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్ట‌కేల‌కు ప్రారంభించింది. మొదటి విడతలో రూ. లక్ష వ‌ర‌కు ఉన్న రుణాలు మాఫీ చేసి చూపింది. అలాగే జూలై నెలాఖరు వరకు లక్షన్నర.. ఆగస్టు 15 నాటికి మొత్తం రెండు లక్షల రూపాయ‌ల వ‌ర‌కు గ‌ల‌ రుణాల‌ను రైతుల తరఫున ప్రభుత్వం (Congress Government) బ్యాంకుల్లో జ‌మ చేసేలా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన మాట ప్రకారం ఈనెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ నిధుల‌ను విడుదల చేశారు. రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేయ‌డంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒకేసారి రూ.2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేయ‌క‌పోవ‌డంపై బిఆర్ ఎస్ ప్ర‌భుత్వం మండిప‌డింది. రేపే రెండో విడుత రుణ మాఫీ Second Phase Raitu RunaMafi : కాగా, ఇప్పటికే రూ.లక్ష వ‌ర‌కు ఉన్న‌ రుణాలను మాఫీ చేసిన కాంగ్రెస్.. రెండో విడత రుణమాఫీకి అం...
Old City  Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ

Old City Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ

Telangana
Old City Metro | హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీకి హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) కనెక్టివిటీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . 78 కిలోమీటర్ల మేర హెచ్‌ఎంఆర్ ఫేజ్-2 విస్తరణకు నిధులు సమకూర్చేందుకు కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీని వల్ల నగర జనాభాలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్ల‌డించారు.ఇటీవ‌ల‌ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ మెట్రో రైల్, ఇప్పుడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ కేస్ స్టడీ.. హెచ్‌ఎంఆర్‌ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామన్నారు.Old City Metro : జాయింట్ వెంచర్ కింద రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం ఖర్చు పెట్టాలని ప్రతిపాదించగా, 15 శాతం నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. మిగిలిన వాటి...
Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Ration Cards | సంక్షేమ పథకాల కోసం ఇక‌పై ‘తెల్ల రేషన్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదా?

Telangana
Ration Cards  | సంక్షేమ పథకాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ముందు త‌ప్ప‌నిస‌రిగా రేష‌న్ కార్డు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌తో రేష‌న్ కార్డు లేని నిరుపేద‌లు ఏ ప‌థ‌కాన్ని కూడా పొంద‌లేక‌పోతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్ర‌భుత్వం తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డుల (white ration card)ను కలిగి ఉండాలనే నిబంధనను తొలగిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. గతంలో, కుటుంబాలు తమ పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందేందుకు, ఇళ్ల స్థలాలను పొందేందుకు, స్వయం ఉపాధి పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తెల్ల రేషన్ కార్డులను సమర్పించాల్సి ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల తర్వాతే కొత్త విధానం అమలులోకి వస్తుందని అధికారులు తెలిపారు.ప్రజా పంపిణీ వ్యవస్థ (ప...
New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ

New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ

Telangana
New pensions | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామంలో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛను (Artistes Pension )కు సంబంధించి సోమ‌వారం జీవో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్ల‌డించారు.స‌మాజంలో కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి రేంవ‌త్ రెడ్డి సారథ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌, దాస‌రి కొండ‌ప్ప‌ తదితరు...
తెలంగాణ‌ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు ఉచిత రవాణా

తెలంగాణ‌ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు ఉచిత రవాణా

Telangana
New Education System | హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సరికొత్త విధానంతో ముందుకు సాగాల‌ని విద్యా శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం తోపాటు ఇతర అధికారులకు సీఎం సూచించారు. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో జ‌రిగిన‌ సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. అంగన్ వాడీలకు సింగిల్ టీచర్ చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ...
Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం

Rythu Runa Mafi : రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులను జమ చేసిన ప్రభుత్వం

Telangana
Rythu Runa Mafi | తెలంగాణలో రైతు రుణమాఫీ నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల సంద‌ర్భంగా నిర్వ‌హించిన‌ ప్ర‌త్యేక‌ కార్యక్రమంలో మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మొదటి విడతలో 11.42 లక్షల మంది రైతులకు రూ. 7 వేల కోట్లు జమ చేయనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రైతులతో ఫోన్లో మాట్లాడారు ముందుగా ఒక రైతుతో మాట్లాడిన తర్వాత‌ బటన్ నొక్కి రుణమాఫీ నిధులను విడుదల చేశారు. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులను విడుదల చేస్తామని సీఎం వెల్ల‌డించారు.రుణమాఫీ (Runa Mafi) నిధులు రైతుల ఖాతాల్లోకి బ‌దులుగా ఇతర ఖాతాల్లోకి మళ్లించకుండా ప్రభుత్వం ప‌టిష్ట‌మైన‌ చర్యలు చేపట్టినట్లు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల సమయంలో సోనియాగాంధీ ఇచ్చిన హామీని నెరవే...
Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభ‌వార్త‌.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్‌ ‌కార్డు ఆధారంగా..

Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభ‌వార్త‌.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్‌ ‌కార్డు ఆధారంగా..

Telangana
Rythu Runa-Mafi Guidelines | హైదరాబాద్: కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ (Loan Waiver) చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.భూమి ఉన్న ప్రతీ రైతు కుటుంబానికి రూ.2 లక్షల పంట రుణమాఫీ వర్తింపు. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తించ‌నున్నారు. రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు వాటి బ్రాంచ్‌ల నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది.. 12 డిసెంబర్ 2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09 డిసెంబర్ 2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలను మాఫీ చేయ‌నున్నారు. 2023 డిసెంబర్ 09 నాటికి బకాయి వున్న అసలు, వడ్డీ మొత్తం పథకానికి అర...
KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బ‌స్ చార్జీల పెంచనున్న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం..!

KSRTC | ఉచిత ప్రయాణాలతో రూ. 295 కోట్ల నష్టం.. బ‌స్ చార్జీల పెంచనున్న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం..!

National
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సు ఛార్జీల పెంపును 20 శాతం వరకు ప్రతిపాదించాలని భావిస్తోంది. కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం (Shakti scheme) కారణంగా గత మూడు నెలల్లో KSRTC రూ.295 కోట్ల మేర భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకుంది. ఈ క్రమంలో ఆర్టీసీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే శక్తి పథకం కార‌ణంగా NWKRTC నష్టాలను చవిచూస్తోందని NWKRTC చైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కేజ్ పేర్కొన్నారు. తమ సమావేశంలో బస్సు చార్జీలను పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు  కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్‌పర్సన్ ఎస్‌ఆర్ శ్రీనివాస్ సైతం ధ్రువీకరించారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య డిపార్ట్‌మెంట్‌ను నిలబెట్టుకోవడానికి టికెట్ ధరలను పెంచాల్సిన ఆవశ్యకతను వారు వివ‌రిస్తున్నారు. గ‌త శుక్రవారం...