Saturday, September 13Thank you for visiting

Tag: Congress Govt

Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

Internet facility | త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ .. ఈ మూడు గ్రామాలో తొలిసారి..

Telangana
Telangana | కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ అందుబాటులోకి తెచ్చి ఇంటర్నెట్‌ కనెక్షన్ల (Internet facility) ను ఏర్పాటు చేయ‌నుంది. న్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు( Minister Sridhar Babu) పేర్కొన్నారు. కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో  మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్‌ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ స్పీడ్ ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని రాష్ట్ర ఐటీ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్‌, నారాయణపేట జిల్లా మద్దూరు గ్రామాలను ఫైలెట్‌ గా ఎంపిక చేసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ గ్...
Bhatti Vikramarka | నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!

Bhatti Vikramarka | నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్‌.. భూమిలేని వారి ఖాతాల్లో రూ. 12 వేలు.. ఈ ఏడాది నుంచే అమలు..!

Telangana
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి Khammam :  భూమిలేని నిరుపేదల బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.12 వేలు జ‌మ‌చేస్తామ‌ని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) వెల్ల‌డించారు. మంగ‌ళ‌వారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో రెండో విడత దళిత బంధు మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా జ‌రిగిన‌ సభలో భ‌ట్టి మాట్లాడుతూ.. రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్య పరిపాలనలోకి వొచ్చింద‌ని, అందుకే త‌మ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని వివ‌రించారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టనున్న‌ట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క తెలిపారు. ఇప్పటికే భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.ఆరు లక్షల...
Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

Ration Cards | గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో అర్హులందరికీ రేషన్‌ ‌కార్డులు

Telangana
New Ration Cards |  పేద ప్రజలకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్‌ ‌కార్డులు, హెల్త్ ‌కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌, ‌హెల్త్ ‌కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ సమావేశం అనంతరం  మంత్రి ఉత్తమ్‌, ‌పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి  కేబినెట్‌ ‌సబ్‌ ‌కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు.కొత్త రేషన్‌ ‌కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్‌ ‌కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్‌ ‌కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్‌ ‌కార్డుల నిబంధనలు ఎలా  ఉండాలని పార్ట...
Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?

Property Tax Every Month | రాష్ట్రంలో ఇక‌పై ప్రతినెలా ఆస్తిపన్ను ?

Telangana
ఆదాయాన్ని పెంచుకునేందుకు స‌ర్కారు క‌స‌ర‌త్తు Property Tax Every Month in Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు షాక్ ఇచ్చింది. ఇక నుంచి ప్రతినెలా ఆస్తి ప‌న్ను చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న ఫీజులు, పన్నులను మరింత సుల‌భ‌త‌రం చేయ‌డంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. ప్ర‌జ‌ల‌పై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచే మార్గాల అన్వేషణ కోసం ప్రభుత్వం సిద్ధ‌మైంది.Property Tax in GHMC: ప్రభుత్వ సేవలకు ప్రజలు చెల్లిస్తున్న పన్నుల చెల్లింపుల ప్ర‌క్రియ‌ను తెలంగాణ ప్ర‌భుత్వం సుల‌భ‌త‌రం చేయాల‌ని భావిస్తోంది. ప్ర‌జ‌ల‌పై ఒక్క‌సారిగా ఆర్థిక భారం పడకుండా, స్థానిక సంస్థలు, ఇతర శాఖల ఆదాయాన్ని పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, ఇతర ప్రభుత్వ శాఖలు కసరత్తు కూడా ప్రారంభించాయి. విద్యుత్తు ఛార్జీలు, నల్లా బిల్...
Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Career
Model Schools | తెలంగాణ‌లోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల క‌ల ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. బ‌దిలీల కోసం 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బ‌దిలీలు చేస్తూ మోడల్స్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2013, 2014లో మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెండు విడుతల్లో నియామ‌క‌మ‌య్యారు. అప్పటి నుంచి వీరికి ఒక్కసారి కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌లేదు. దీంతో గత ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గ‌త సంవత్స‌రం జూలైలో మోడ‌ల్ స్కూళ్ల టీచ‌ర్ల  (Model Schools Teachers )బ‌దిలీల‌కు షెడ్యూల్‌ జా...
Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?

Solar Pump Set | రైతుల‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లో ఉచితంగా సోలార్ పంపు సెట్లు..?

Telangana
Solar Pump Set | హైదరాబాద్ : రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ( Solar Energy )ఉత్ప‌త్తి పెంచేందుకు తెలంగాణ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తోంది. ఇప్ప‌టికే గృహ‌జ్యోతి ప‌థ‌కం (Gruha jyothi Pathakam)  కింద పేద‌ల‌కు 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ అందిస్తుండ‌డంతో ప్ర‌భుత్వంపై భారం ప‌డుతోంది. అంతేకాకుండా కొన్ని నెల‌లుగా విద్యుత్ స‌ర‌ఫ‌రాలో తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డుతుండ‌డ‌తో ప్ర‌జ‌ల నుంచి అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విద్యుత్ శాఖ‌పై బుధ‌వారం స‌మీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భ‌విష్య‌త్ విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చూసుకోవాల‌న్నారు. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన‌ చర్యలు చేపట్టాల‌ని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్ప‌త్తిని ...
N Convention |  నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

N Convention | నాగార్జునకు ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

Trending News
Telangana | హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ (HYDRA) అధికారులు శనివారం ప్రముఖ‌ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)కు చెందిన మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ (N Convention ) సెంటర్‌ను కూల్చివేశారు. తమ్మిడి కుంట సరస్సులోని ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) పరిధిలో దీనిని నిర్మించినట్లు ఆరోపణలు వచ్చాయి. "హైడ్రా అధికారులు ఉదయమే ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చివేయడం ప్రారంభించారు. కూల్చివేత సజావుగా జరిగేలా మేము పోలీసు బలగాలను మోహరించాము, ఈ భూమి ఎఫ్‌టిఎల్ జోన్‌లోకి వస్తుంది" అని మాదాపూర్ డిసిపి తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ ను కూల్చివేసే ముందు తమకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. అంతేకాకుండా కేసు కోర్టులో ఉండ‌గా ఇలా అర్ధంతరంగా కూల్చివేయడం స‌మంజ‌సం కాద‌న్నారు. చెరువు భూమికి ఒక్క అంగుళం కూడా అక్రమించలేదని స్ప‌ష్టం...
Fine Rice to Ration Card Holders | పేదలకు గుడ్ న్యూస్.. రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం .. గోధుమలు కూడా

Fine Rice to Ration Card Holders | పేదలకు గుడ్ న్యూస్.. రేషన్‌ ‌షాపుల్లో సన్న బియ్యం .. గోధుమలు కూడా

Telangana
Ration Card Holders | హైదరాబాద్ : ‌రాష్ట్రంలోని పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్‌ ‌న్యూస్‌ ‌చెప్పింది. వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల్లో ‌సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం సన్నబియ్యం మాత్రమే కాదు.. ఇకపై సబ్సిడీ ధరలకు గోధుమలను కూడా పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది ప్ర‌భుత్వం. స‌న్న‌బియ్యం పంపిణీపై మంత్రి స‌మీక్ష‌ ఈమేర‌కు హైదరాబాద్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర స్థాయి విజిలెన్స్ ‌కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రేషన్‌ ‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీపై అధికారులతో మంత్రి చర్చించారు. పేద ప్ర‌జ‌ల‌కు ఉద్దేశించిన‌ రేష‌న్ బియ్యం పక్కదారి పట్టకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని రేషన్‌ ‌డీలర్లను మంత్రి ఉత్త‌మ్‌ హెచ్చరించారు. డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి ప్రోత్సాహకాలు అందజేస్తుందని ఆయ‌న‌ హామీ ఇచ్చార...
RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

RRR | ఆర్‌ఆర్‌ఆర్ కోసం భూసేక‌ర‌ణపై ప్ర‌భుత్వం కీల‌క ఆదేశాలు

Telangana
హైదరాబాద్‌ ‌రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు (RRR ) ‌ప్రాజెక్టుకు కావ‌ల‌సిన భూసేకరణ కు మొద‌టి ప్రాధాన్యం ఇచ్చి సెప్టెంబర్‌ ‌రెండవ వారంలోగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. రీజినల్‌ ‌రింగ్‌ ‌రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం హైద‌రాబాద్ లోని సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్‌ ‌శాంతి కుమారి మాట్లాడుతూ... హైద‌రాబాద్ లోప్రతిష్టాత్మక ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రాజెక్టుపై ప్ర‌భుత్వం అత్యధిక ప్రాముఖ్యత‌ను ఇస్తోంద‌ని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ‌సంబంధించి వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్ర‌క్రియను వేగవంతం చేయాలని సూచించారు. భూసేరణ నష్ట పరిహారానికి సంబంధించిన అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.RRR కింద భూములు...
Warangal Inner Ring Road | వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కీల‌క వ్యాఖ్యలు..

Warangal Inner Ring Road | వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుపై మంత్రి కీల‌క వ్యాఖ్యలు..

Local
Warangal Inner Ring Road | వరంగ‌ల్‌ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్-చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం వరంగల్ నగర అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ‌రంగ‌ల్‌ స్మార్ట్ సిటీ, భద్రకాళి దేవస్థానం, మెగా టెక్స్ టైల్ పార్కు, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంశాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ ల కోసం రైతు సంతృప్తి చెందేలా మానవీయ కోణంలో భూసేకరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్ అండ్‌బి అధికారులతో సమావే...