Bank Loans | మహిళలకు గుడ్ న్యూస్.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు
Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వడ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్ లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాలని ఆమె ఈసందర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
రూ.10 లక్షల ప్రమాద బీమా..
స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...