
తెలంగాణలో రేపే కౌంటింగ్.. ఉదయం 10 గంటల్లోపు తొలి ఫలితం
Telangana Election Results: తెలంగాణలో ఆదివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంనే ఓట్ల లెక్కింపు మొదలు కానుంది.Telangana Assembly Election Counting: మరికొద్ది గంటల్లోనే తెలగాణ ఎన్నికల కౌంటింగ్ షురూ కానుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా... ఆదివారం ఉదయం 10 గంటల వరకు తొలి ఫలితం వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు.అయితే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయని వికాస్‌రాజ్ తెలిపారు. ఈవీఎంలను పార్టీ ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలకు తరలించామని, ప్రస...