Cheyutha Scheme | చేయూత పథకం ఎవరి కోసం.. ఈ స్కీమ్ తో ప్రయోజనాలేంటీ.. దరఖాస్తు ఎలా ?
Cheyutha Scheme రాష్ట్ర ప్రభుత్వం శారీరక సమస్యలతో బాధపడుతున్న నిరుపేదల కోసం చేయూత పథకాన్ని తీసుకొచ్చింది.. ఈ స్కీమ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పనిచేస్తుంది. దీర్ఘకాలిక శారీరక సమస్యలతో బాధపడుతున్నవారు.. 1,672 రకాల విభిన్న వైద్య ప్యాకేజీలు , 21 ప్రత్యేక సేవలు అందిస్తూ ఉచిత వైద్య , ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందించడమే ఈ పథకం లక్ష్యం. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 90 లక్షల కుటుంబాలకు ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
చేయూత పథకం ప్రయోజనాలు
నెలవారీ పెన్షన్ : వివిధ వర్గాలకు రూ.4000, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, నిర్దిష్ట పరిశ్రమలలోని కార్మికులకు పెన్షన్లు అందించడం.
ఆరోగ్య సంరక్షణ కవరేజ్: ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రూ.10 లక్షలు, వైద్య సేవలను పెంచడం.
డ్రైవర్లకు బీమా సౌకర్యం: క్యాబ్, ఆటో, ఫుడ్ డెలివరీ డ్రైవర్లకు ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు, వారి భ...