
X Down : చాట్‌జీపీటీ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారుల ఫిర్యాదులు
ChatGPT, X Down : దేశవ్యాప్తంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ మరోసారి డౌన్ అయింది. ఎలోన్ మస్క్ కు చెందిన ఎక్స్ డౌన్ కావడంతో లక్షలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వారి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్లలో ఓపెన్ కావడం లేదు. కొన్ని ఫోన్లలో ఓపెన్ చేసినా, ఎలాంటి అప్‌డేట్‌లు కనిపించడంలేదు. ఓపెన్ అవ్వగానే, "ఏదో తప్పు జరిగింది. ట్రై రీలోడ్" అని చెబుతుంది.వేలాది మంది వినియోగదారులు ఫిర్యాదుఈరోజు, భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో కూడా X పనిచేయడం లేదు. దీని వల్ల లక్షలాది మంది వినియోగదారులు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య అమెరికాలో కూడా సంభవించింది. వివిధ మీడియా నివేదికల ప్రకారం, X పనిచేయకపోవడంతో, వేలాది మంది వివిధ మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రజలు Xలో ఏమీ పోస్ట్ చేయలేకపోయారు లేదా ఎటువంటి అప్‌డేట్‌లు చూడలేకపోయారు. దీని ...
