Charlapalli railway station | ఎయిర్ పోర్ట్ ను తలపించేలా చర్లపల్లి రైల్వేస్టేషన్.. ఈ రైళ్లు ఇక్కడి నుంచే..
Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది.ఈ కొత్త టెర్మినల్ ప్రారంభమయ్యాక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా ...