Kolkata Rape Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అరెస్ట్
Kolkata Rape Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం-హత్య కేసులో సిబిఐ పెద్ద అడుగు వేసింది. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandeep Ghosh)ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ శనివారం (సెప్టెంబర్ 14) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 23 వరకు ఆయన జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు.గతంలో ఆర్థిక అవకతవకల కేసులో మాజీ ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా అత్యాచారం-హత్య కేసులో నిందితుడిగా కూడా అరెస్టు చేశారు. ఆర్‌జి కర్ రేప్ కేసు దర్యాప్తులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో జాప్యం, సాక్ష్యాలు మాయం చేసినట్లు ఆరోపణలపై సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అభిజీత్ మండల్‌లను సిబిఐ అరెస్టు చేసింది. సందీప్‌ను ఆదివారం సీల్దా కోర్టులో హాజరుపరచనున్నారు.
సాక్ష్యాల తారుమారు
నివేదికల ప్రకారం, సందీప్ ఘో...