RG Kar Hospital | ఆర్జికర్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ పై విస్తుగొలిపే నేరారోపణలు | అనాథ మృతదేహాలను వదల్లేదు..
Kolkatha Rape Murder Case | కోల్‌కతాలో 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై దారుణమైన అత్యాచారం హత్య నేపథ్యంలో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (RG Kar Hospital ) మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ (Sandip Ghosh) పై షాకింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. ఘోష్ హయాంలో అవినీతి, నేర కార్యకలాపాలకు సంబంధించి భయంకరమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంస్థలో "మాఫియా లాంటి" పాలన కొనసాగినట్లు వార్తలు వచ్చాయి.2021లో ప్రిన్సిపాల్‌గా నియమితులైన ఘోష్, ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీకి వచ్చే క్లెయిమ్ చేయని మృత దేహాలను అనధికార అవసరాల కోసం అమ్ముకొని సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ.. ఘోష్ "బయోమెడికల్ వేస్ట్ స్కామ్" నిర్వహించారని, రబ్బరు గ్లోవ్‌లు, సెలైన్ బాటిళ్లు, సిరంజిలు, సూదులు వంటి వ్యర్థాలను అనధికారిక సంస్థలకు విక్రయించేవారని పేర్కొన్నారు. ఈ పద్ధతులు బయో-...