Tuesday, December 30Welcome to Vandebhaarath

Tag: BJP Lok Sabha Candidates First List

BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..
National

BJP Candidates First List | బీజేపీ లోక్‌స‌భ అభ్య‌ర్ధుల తొలి జాబితా విడుద‌ల‌.. తెలంగాణలో బరిలో నిలిచేది వీరే..

BJP Candidates First List : లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌నున్న 195 మంది అభ్య‌ర్ధుల‌తో బీజేపీ తొలి జాబితాను శ‌నివారం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మ‌రోసారి వార‌ణాసి నుంచే పోటీ చేయ‌నున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజ‌రాత్‌ గాంధీ న‌గ‌ర్ నుంచి బ‌రిలో నిల‌వ‌నున్నారు.గ‌తంలో రాజ్య స‌భకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ గుజ‌రాత్‌లోని పోర్ బంద‌ర్ నుంచి బ‌రిలో ఉంటున్నారు. ఢిల్లీ నుంచి ప్ర‌వీణ్ ఖండేల్వాల్‌, మ‌నోజ్ తివారీ, సుష్మా స్వ‌రాజ్ కుమార్తె బ‌న్సూరి స్వ‌రాజ్ పోటీ చేయ‌నున్నారు. ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రుల‌కు చాన్స్‌ ల‌భించ‌గా 28 మంది మ‌హిళ‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది.ఇద్ద‌రు మాజీ ముఖ్య‌మంత్రుల‌కు అవ‌కాశమిచ్చారు. 57 మంది ఓబీసీల‌కు తొలి జాబితాలో స్ధానం క‌ల్పించ‌గా, కీల‌కమైన‌ యూపీ నుంచి 51 మంది అభ్య‌ర్ధుల‌ను మొద‌టి జాబితాలో ప్ర‌క‌టించారు. ప‌శ్చిమ బెంగాల...