
Bihar | జర్నలిస్టులకు పెన్షన్ మొత్తాన్ని పెంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్
'బీహార్ పాత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం (Bihar Patrakaar Samman Pension Scheme) కింద జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను పెంచుతున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం ప్రకటించారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇప్పుడు నెలకు రూ.15,000 లభిస్తుంది, ఇది గతంలో రూ.6000 ఉండగా ఇప్పుడు భారీగా పెంచారు.అంతేకాకుండా, ఈ పథకం కింద పెన్షన్ పొందుతున్న జర్నలిస్ట్ మరణిస్తే, మరణించిన వ్యక్తి భార్యకు నెలకు రూ. 10,000 జీవితకాల పెన్షన్ లభిస్తుంది. అలాంటి మహిళలు గతంలో నెలకు రూ. 3000 పొందేవారు.దీనికి సంబంధించిన సూచనలను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంబంధిత శాఖకు తెలియజేశారు."బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం కింద, అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ రూ.6,000కి బదులుగా రూ.15,000 నెలవారీ పెన్షన్ అందించాలని శాఖకు సూచనలు ఇచ్చామని ముఖ్యమంత్రి నితిష్ కుమార్ తెలిపారు. అదనంగా, 'బీహార్ పత్రకార్ సమ్మాన్ పెన్షన్ పథకం' క...