RSS | బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలను అరికట్టాలి..
Bengaluru : బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై జరుగుతున్న దారుణాలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హింసను ఆపడానికి తక్షణమే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో ఈ వర్గాల ఉనికి ప్రమాదంలో ఉందని పేర్కొందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి (UN) తోపాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. RSS లో అతిపెద్ద నిర్ణయాధికార సంస్థ అయిన అఖిల భారత ప్రతినిధి సభ (ABPS) మూడు రోజుల సమావేశం బెంగళూరులో జరిగింది.1951లో బంగ్లాదేశ్‌లో హిందూ జనాభా 22% ఉండగా, ఇప్పుడు అది 7.9%కి తగ్గిందని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. హిందూ జనాభా కేవలం 7.9%కి తగ్గింది. బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిక్ శక్తులు హిందువులు, ఇతర మైనారిటీ వర్గాలపై నిరంతర ప్రణాళికాబద్ధమైన హింసనే ...