ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..
Bangladesh Violence | బంగ్లాదేశ్ లో హిందువులపై హింస, ఇస్కాన్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) అరెస్టు చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. చిన్మోయ్ అరెస్టును ఖండించారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్‌ను కోరారు.ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని మనం అందరం కలిసి ఖండిద్దాం. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని (ప్రభుత్వం) హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అని కళ్యాణ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు.బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భా...