Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..
Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల 'బజాజ్ ఫైటర్' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్ అని తెలుస్తోంది.
CNG బైక్ జూన్ 18న విడుదల
బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల జరిగిన పల్సర్ 400 లాంచ్ ఈవెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ను జూన్ 18న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు సగం వరకు తగ్గుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా స్థిరంగాకొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోత...