Ayodhya Ram Mandir Updates : బాల రాముడి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు.. 10 రోజుల్లో ₹ 12 కోట్లకు పైగా విరాళాలు
Ayodhya Ram Mandir Updates : అయోధ్య రామమందిరంలో భక్తులు బాలరాముడికి ఉదారంగా విరాళాలు ఇస్తూ తమ అచంచలమైన భక్తిని ప్రదర్శిస్తున్నారు. జనవరి 23న ఆలయాన్ని ప్రజల కోసం తెరిచినప్పటి నుంచి కేవలం 10 రోజుల్లోనే రూ . 12 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తో విరాళాలు వచ్చిచేరుతున్నాయి.జనవరి 23 న ప్రజలకు దర్శనభాగ్యం కల్పించినప్పటి నుండి, ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత పది రోజుల్లోనే రామ్ లల్లా (Ram lalla) కు దాదాపు 12 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. జనవరి 22న రామ్‌లల్లా పవిత్రోత్సవం సందర్భంగా, ఎనిమిది వేల మంది హాజరయ్వారు. ఆ రోజున రూ. 3.17 కోట్లు విరాళంగా సేకరించబడ్డాయి. జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరగడంతో అయోధ్యకు భక్తులు, పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రతి రోజు, వందల వేల మంది ప్రజలు పూజలు, సందర్శనల కోసం వస్తారు.
గతేడాది 5.76 కోట్ల మంది సందర్శకులు
2023లో అయోధ్య...