Gir National Park | గిర్ నేషనల్ పార్క్ ఎందుకు ప్రత్యేకమైనది.. ప్రధాని మోదీ కెమెరాతో అక్కడికి ఎందుకెళ్లారు..?
PM Modi At Gir National Park | ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం (world wildlife day) సందర్భంగా 2025 మార్చి 3 సోమవారం గుజరాత్‌లోని జునాగఢ్‌లోని గిర్ జాతీయ ఉద్యానవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వెళ్లారు. ఈ సందర్శన సమయంలో, ప్రధాని మోదీ జంగిల్ సఫారీని ఆస్వాదించారు. అనేక జంతువులను ఆయన స్వయంగా ఫోటో తీశారు. ప్రధాని మోదీ తన కెమెరాలో అనేక సింహాల చిత్రాలను బంధించారు.ప్రధాని మోదీ గుజరాత్ (Gujarat) పర్యటనలో ఉన్నారని తెలిసిందే.. ఈ రోజు ఆయన గిర్ నేషనల్ పార్క్ చేరుకున్నాడు. తన పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి ప్రాజెక్ట్ లయన్‌ను ప్రారంభిస్తారు. సింహాల సంరక్షణపై ప్రధానమంత్రి ఒక ముఖ్యమైన సమావేశాన్ని కూడా నిర్వహిస్తారు. గిర్ నేషనల్ పార్క్ ఆసియా సింహాలకు రెండవ నిలయంగా పరిగణించబడుతుంది .18 సంవత్సరాల తర్వాత ప్రధాని మోదీ గిర్ జాతీయ ఉద్యానవనానికి చేరుకున్నారు.సింహాల స్వేచ్ఛా విహారంగిర్...