Indian Railways | ఐసిఎఫ్ కోచ్‌ల స్థానంలో అత్యాధునిక లింక్-హాఫ్‌మన్-బుష్ కోచ్‌లు
Indian Railways | రైల్వే భద్రతకు సంబంధించి భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది. పాత కోచ్ ల స్థానంలో అత్యాధునిక వసతులు కలిగిన, పటిష్ట భద్రత ప్రమాణాలు గల కోచ్ లతో భర్తీ చేస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnaw) రాజ్యసభలో ఒక కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి రైల్వేలు అన్ని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కోచ్ (ICF) లను లింక్-హాఫ్‌మన్-బుష్ (LHB) కోచ్‌లతో భర్తీ చేస్తాయని ఆయన చెప్పారు. ఇది భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. ఐసిఎఫ్ కోచ్‌లు పాత డిజైన్‌తో ఉంటాయి. అయితే ఎల్‌హెచ్‌బి కోచ్‌లు ఆధునిక సాంకేతికతతో తయారు చేశారు. ప్రమాదాలు జరిగిననపుడు చాలా తక్కువ నష్టం వాటిల్లుతుంది. అయితే ప్రయాణీకులకు ఇచ్చే సబ్సిడీలో ఎటువంటి మార్పు లేదని వైష్ణవ్ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికీ అద్దెపై 47% సబ్సిడీ ఇస్తోంది. అంటే టికెట్ ధర ₹100 అయితే, ప్రభుత్వం తన వైపు నుంచి ₹47 ఇస్తుంది.Indian Railways : విదేశా...