Old City | విద్యుత్ బిల్లుల వసూళ్ల బాధ్యతలను అదాని గ్రూప్ కు అప్పగించడంపై దుమారం..
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ (Hyderabad Old City) లో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను అదానీ గ్రూపునకు అప్పగిస్తూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాజకీయంగా దుమారం రేపింది. న్యూఢిల్లీలో ఇటీవల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్ట్‌గా, విద్యుత్ పంపిణీ, విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగిస్తామని సిఎం రేవంత్ చెప్పారు. సేకరించిన మొత్తంలో 75% రాష్ట్ర ఖజానాకు, మిగిలిన 25% అదానీకి వస్తాయని రేవంత్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అదానీ గ్రూపు ఆమోదం తెలిపిందని, కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.
బిల్లుల వసూలంటే ముచ్చమటలే..
కాగా హైదరాబాద్ పాత బస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియ అత్యంత సవాల్ తో కూడుకున్నది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడం వం...