Afghanistan earthquake: భారీ భూకంపంలో 320 మందికి పైగా మృతి.. నేలమట్టమైన 12 గ్రామాలు
Kabul : ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా సుమారు 320 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం.. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్ ( Afghanistan's Herat) లో 6.3 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 320 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా , వందలాది మంది గాయపడ్డారు. కాగా హెరాత్‌లోని స్థానిక అధికారులు ఈ ప్రావిన్స్‌లో అనేక భూకంపాల (earthquake) లో 30 మందికి పైగా మరణించారని 600 మందికి పైగా గాయపడ్డారని పజ్వాక్ ఆఫ్ఘన్ న్యూస్ నివేదించింది.Afghanistan earthquake అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జిందా జాన్, ఘోరియన్ జిల్లాల్లోని 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతకుముందు, విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సైక్ మాట్లాడుతూ.. నేటి భూకంపం కారణంగా హెరాత్‌లోని "జిందా జాన్" జిల్లాలోని మూడు గ్రామాలలో కనీసం 15 మంది మరణించారని, దాదాపు 40 మంది గాయపడ్డారని టోలో న్యూస్ నివ...