Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: 2024 lok sabha elections

Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ – ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..
Elections

Opinion Polls vs Exit Polls : ఒపీనియన్ పోల్స్ – ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా తెలుసా..

Opinion Polls vs Exit Polls | 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్ర‌జ‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సహా రాజకీయ నిపుణులు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయినా ప్రతిపక్షం చివరి వరకు పోరాడాలనే పట్టుదలతో ఉంది. జూన్ 1న చివరి దశ ఎన్నికల ముగింపు కోసం ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే , ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డుతాయి. ఇది జూన్ 4న ప్రకటించబడే తుది ఫలితాలకు సంబంధించి ముందస్తుగానే ఒక అంచ‌నా అందిస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా అన్ని దశల పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమ‌లులో ఉంటుంది. కాబ‌ట్టి ఎన్నికల సంఘం ప్రకటన ప్రకారం జూన్ 1 సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించారు.ఎన్నికల సీజన్‌లలో ఓట‌రు ఎటువైపు మొగ్గు చూపుతున్నాడ‌నే విష‌యంపై ఒపీనియన్ పోల్స్, ...
Lok Sabha Elections 2024 : రేపటి పోలింగ్ లో తెలుగు రాష్ట్రాల్లో కీలక పోరు ఈ నియోజకవర్గాల్లోనే..
Elections

Lok Sabha Elections 2024 : రేపటి పోలింగ్ లో తెలుగు రాష్ట్రాల్లో కీలక పోరు ఈ నియోజకవర్గాల్లోనే..

Key Candidates in AP-Telangana : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నాలుగో దశ ఓటింగ్ మే 13, సోమవారం జరుగుతుంది. నాలుగో విడ‌త‌లో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప‌రిధిలోని 96 నియోజకవర్గాల్లో ఎన్నికలు (Lok Sabha Elections 2024 ) జ‌ర‌గ‌నున్నాయి.  ఈ దశలో, 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 96 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ (25), బీహార్ (5), జమ్మూ కాశ్మీర్ (1), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), తెలంగాణ (17) , ఉత్తర ప్రదేశ్ (13), పశ్చిమ బెంగాల్ (8) పోలింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది.ఆంధ్రప్రదేశ్: అరకు (ఎస్టీ), శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం (ఎస్సీ), రాజమండ్రి, నర్సాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల (ఎస్సీ), ఒంగోలు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, తిరుపతి...
SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..
Elections, National

SC/ST/OBC రిజ‌ర్వేష‌న్లపై అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు..

Amit Shah | ల‌క్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా..  ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌సింగ్‌కు మద్దతుగా నిర్వ‌హించిన ర్యాలీలో అమిత్‌ షా, కాంగ్రెస్‌ను 'అబద్ధాల ఫ్యాక్టరీ' అని అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు.       రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అమ‌లు చేస్తుంద‌న్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రెండు పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీ ఉందని, కానీ నరేంద్ర మోడీ (PM Modi) రిజర్వేషన్‌కు మద్దతు తెలిపార‌ని గుర్తుచేశారు. రిజ‌ర్వేష‌న్ల‌ను బీజేపీ రద్దు చేయదన...
Phase 2 Voting | రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమమాలిని, ఓం బిర్లా – ఎన్నికల ఫేజ్ 2లో కీలక అభ్యర్థులు మ‌రెంద‌రో..
Elections

Phase 2 Voting | రాహుల్ గాంధీ, శశి థరూర్, హేమమాలిని, ఓం బిర్లా – ఎన్నికల ఫేజ్ 2లో కీలక అభ్యర్థులు మ‌రెంద‌రో..

Phase 2 Voting LokSabha Polls | రెండో విడత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, అరుణ్ గోవిల్‌లు, బీజేపీకి చెందిన హేమమాలిని, ఓం బిర్లా, గజేంద్ర సింగ్ షెకావత్ త‌దిత‌రులు కీలక అభ్యర్థులుగా నిలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో వారు తమ తమ నియోజకవర్గాల నుంచి గెలుపొందారు. మొద‌టి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు గత శుక్రవారం జరిగిన తొలి దశ ఎన్నికల్లో దాదాపు 65.5 శాతం ఓటింగ్ నమోదైంది.రెండో దశలో, 12 రాష్ట్రాలు, యూటీలో మొత్తం 89 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కేరళలోని మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలోని 14 స్థానాలు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 7 చొప్పున పోలింగ్ జ‌ర‌గ‌నుంది. అలాగే అస్సాం, బీహార్‌లో ఐదు చొప్పున‌, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌లలో మూడు చొప్పున‌ సీట్లు, మణిపూర్, త్రిపుర జమ్మూ మరియు క...
Indore Lok Sabha | ఎన్నిక‌ల్లో ఓటువేస్తే రుచిక‌ర‌మైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అంద‌జేస్తార‌ట‌..
Elections

Indore Lok Sabha | ఎన్నిక‌ల్లో ఓటువేస్తే రుచిక‌ర‌మైన జిలేబీలు, ఐస్ క్రీమ్‌లు అంద‌జేస్తార‌ట‌..

Indore Lok Sabha : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఫుడ్ షాపుల యజమానులు వచ్చే నెలలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభ సమయంలో ఓటు వేసిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలు, ఐస్‌క్రీం అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్య పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ (Indore Lok Sabha) లో మే 13న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ వాణిజ్య సంస్థల సమావేశంలో ఉచిత ఆహార పదార్థాలను అందించాలని నిర్ణయించినట్లు దుకాణ యజమానులు తెలిపారు.స‌మావేశం అనంతరం ఆశిష్‌ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఓటింగ్‌లో ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలపాలనుకుంటున్నామని, ఇందుకోసం వాణిజ్య సంస్థల సహకారం తీసుకుంటున్నామని ఆయ‌న‌ అన్నారు. నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఓటు వేసే ప్రజలకు ఉచితంగా పోహా, జిలేబీలు అందజేస్తామని నగరంలో...
PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: ప్రధాని మోదీ
Elections

PM Modi : కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే: ప్రధాని మోదీ

PM Modi : జైపూర్ : కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ (PM Modi) పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ప్రజల సంపదను లాక్కొని "ఎంపిక చేసిన‌" వ్యక్తులకు పంచడానికి భారీ కుట్ర పన్నుతున్నారని మరోసారి ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) వినడం కూడా నేరంగా మారుతుందని మోదీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం హనుమాన్ జయంతిని జరుపుకుంటున్న రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ‌స్ధాన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రీరామన‌వమి వేడుక‌ల‌ను కూడా నిషేధించింద‌ని పేర్కొన్నారు. రాజ‌స్ధాన్‌లో మొదటిసారి ఈసారి రామ‌న‌వ‌మి సంద‌ర్భంగా శోభాయాత్ర నిర్వహించారని  ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లు రామ శ‌బ్ధాన్ని ఆల‌పించే రాజ‌స్దాన్ వంటి రాష్ట్రంలో కాంగ్రెస్ రామ‌నవ‌మిని నిషేధించడమేంటని ప్రశ్నించారు.రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఆదివారం జరిగిన ర్యాలీలో తాను చేసిన ‘సంపద పునఃపంపిణీ’ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌, విప‌క...
Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌
Elections

Lok Sabha Elections 2024 | భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల 2024 ప్రారంభానికి గుర్తుగా సరికొత్త డూడుల్‌

Lok Sabha Elections 2024 : ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి గుర్తుగా గూగుల్ డూడుల్‌ (Google Doodle ) ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల 2024 మొదటి దశ ఎన్నికలు శుక్రవారం  నాలుగు రాష్ట్రాలలో ప్రారంభమైంది. మిలియన్ల మంది భారతీయుల తమ  ఓటు హక్కును వినియోగించుకుటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి తిరిగి మూడోసారి లేదా అని ఈ ఎన్నికలు తేల్చనున్నాయి. ప్రధాని మోదీ గెలిస్తే, దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న రెండో భారతీయ నాయకుడిగా చరిత్రలో నిలుస్తారు. . కాగా  Google Doodle డూడుల్ చిహ్నమైన ఓటింగ్ గుర్తును కలిగి ఉన్న చూపుడు వేలు ద్వారా ఓటింగ్ సింబాలిక్ చిత్రాన్ని చూడొచ్చు.ఈ సంవత్సరం, 18వ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ, భారత కూటమి మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఫేజ్ 1 పోలింగ్‌లో, 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు (UTలు) 1...
Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్
National

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు రాహుల్ వెనుకాడుతున్నాడు : ఆజాద్

Jammu Kashmir | బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ వెనుకాడుతున్నారని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చైర్మన్ గులాం నబీ ఆజాద్ విరుచుకుపడ్డారు . బీజేపీపై రాహుల్ గాంధీ 'ధైర్య పోరాటం' చేస్తున్నారనే వాదనలన్నింటినీ ఆయన కొట్టిపారేశారు. మైనారిటీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గాంధీ ఆశ్రయం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.రాహుల్‌ గాంధీ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (NC) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లాను ఆజాద్ విమర్శించారు, వారిని రాజకీయ నాయకులు కాకుండా "spoon-fed kids" అని ప్రస్తావిస్తూ, ఇద్దరూ తమంతట తాముగా ఏమీ చేయలేదని అన్నారు. "రాహుల్ గాంధీ బిజెపి పాలిత రాష్ట్రాలలో పోటీ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? గాంధీ బిజెపితో పోరాడుతున్నట్లు ఆపార్టీ నేత‌లు చెబుతున్నారు. కానీ ఆయ‌న చర్యలు భిన్నంగా ఉన్నాయి. బిజెపి పాలిత రాష్ట్రాల నుంచి పారిపోయి మైనారి...
Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !
National

Congress | మరో పది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ . !

Congress candidates |వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పది మంది అభ్యర్థులతో మరో జాబితాను  విడుదల చేసింది. ఈ లిస్టులో పంజాబ్ మాజీ ముఖ్య మంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, బీహర్ నాయకుడు కన్నయ్య కుమార్ పేర్లు ఉన్నాయి. ఇక ఢిల్లీ నార్త్ ఈస్ట్ సీట్ నుంచి జేఎన్ యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్యకుమార్, పంజాబ్ లోని జలంధర్ (ఎస్సీ) నుంచి చరణ్ జిత్ సింగ్ చన్నీ బరిలో ఉన్నారు.ఫతేగఢ్ సాహిబ్ (ఎస్సీ) నుంచి అమర్ సింగ్, అమ్రుత్ సర్ నుంచి గుర్జీత్ సింగ్ ఔజ్లా,  సిద్సంగ్రూర్ నుంచి సుఖ్ పాల్ సింగ్ ఖైరా, పాటియాలా నుంచి డాక్టర్ ధరమ్ వీర్ గాంధీ,భాటిండా స్థానానికి జీత్ మొహిందర్ సింగ్, యూపీలోని అలహాబాద్ స్థానానికి ఉజ్వల్ రేవతి రమన్ సింగ్ ను పోటీలో నిలిపింది. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులతో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కోసం 75 మంది అభ్యర్థులతో మరో జాబితాను ప్రకటించింది....
ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..
National

ADR report | 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ ప్రశ్నలు అడిగిన పార్టీలు ఇవే..

ADR Report  | న్యూఢిల్లీ: 17వ లోక్‌సభలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందగా , వాటిలో 45 బిల్లులు సభలో ప్రవేశపెట్టిన రోజునే ఆమోదం పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ( ఏడీఆర్ ) విశ్లేషణలో వెల్లడైంది. లోక్‌సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు అత్యధికంగా 410 ప్రశ్నలు అడిగారు. అప్నా దళ్ (సోనీలాల్)కు చెందిన ఇద్దరు ఎంపీలు కనీసం ఐదు అడిగారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధ‌వారంప్రచురించిన నివేదికలో పేర్కొంది. శివసేన 354 ప్రశ్నలతో, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం 284, తెలుగుదేశం పార్టీ (TDP) 247, ఎంకే స్టాలిన్ డీఎంకే 243 ప్రశ్నలు సంధించింది.ఇదిలా ఉంటే, అత్యల్ప సగటు ఉన్న పార్టీలలో అప్నా దళ్ (సోనీలాల్) ఐదు ప్రశ్నలు, అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఏడు, ఆప్ 27, నేషనల్ కాన్ఫరెన్స్ 29, ఎల్‌జెపి 34 ప్రశ్నలు సంధించారు.  సగటున బీజేపీ ఎంపీలు 14...