
New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?
New SIM Card Rules : కొత్త 'టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023' దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది.జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా నియంత్రించేందుకు లేదా పర్యవేక్షించేందుకు ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌లో కమ్యూనికేషన్‌లను రద్దు చేసే సామర్థ్యం ప్రభుత్వానికి ఉంటుంది.కొత్త నిబంధనల ప్రకారం భారతీయులెవరూ తొమ్మిది కంటే ఎక్కువ SIM కార్డ్‌లను పొందేందుకు వీలు లేదు. మరోవైపు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్ నివాసితులు గరిష్టంగా ఆరు సిమ్ కార్డ్‌లకు మాత్రమే తీసుకోవడానికి అవక...