
సర్వాంగ సుందరంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ – Malakpet railway station
Malakpet railway station | అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme) లో భాగంగా మలక్‌పేట రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయితే ఈ స్టేషన్ లో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. పునరాభివృద్ధి పనులు 70% వరకు చేరుకున్నాయి. మలక్ పేట్ రైల్వే స్టేషన్ లో ఆధునిక సౌకర్యాలు, మెట్రో ఇంటిగ్రేషన్, పర్యావరణ అనుకూల డిజైన్‌తో, రూ.36.44 కోట్లతో మలక్‌పేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి 2025 చివరి నాటికి పూర్తి చేసి సిద్ధం చేసి వినియోగించుకునేలా చేయాలని దక్షిణమధ్య రైల్వే (South Central Railway) అధికారులు యోచిస్తున్నారు. ఇది పాతబస్తీ నగర ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించనుంది.అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్..రైల్వే మంత్రిత్వ శాఖ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) యొక్క సనయా భారత్ నయా స్టేషన్' చొరవలో భాగ...