IRCTC Ramayana Train Tour | శ్రీ రామాయణ యాత్ర డీలక్స్ రైలు 25న ప్రారంభం.. 30కు పైగా ఆధ్యాత్మిక గమ్యస్థానాలు, ధరలు ఇవే
IRCTC Ramayana Train Tour: అయోధ్యలో దివ్య భవ్యమైన రామాలయం ప్రారంభమైన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని రాములవారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) జూలై 25, 2025న తన ఐదవ “శ్రీ రామాయణ యాత్ర” డీలక్స్ రైలు పర్యటనను ప్రారంభించేందుకు సిద్ధమైంది.17 రోజుల ఈ ప్రయాణం భారత్, నేపాల్ అంతటా రాముడితో సంబంధం ఉన్న 30కి పైగా గమ్యస్థానాలను కవర్ చేస్తుంది.టూర్ ప్లాన్, గమ్యస్థానాలుఈ ప్రయాణం దిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై మొదట అయోధ్యలో ఆగుతుంది, అక్కడ ప్రయాణీకులు శ్రీ రామ జన్మభూమి ఆలయం, హనుమాన్ గర్హి, రామ్ కీ పైడి (సరయూ ఘాట్) లను సందర్శిస్తారు.నందిగ్రామ్: భారత్ మందిర్, సీతామర్హి, జనక్‌పూర్ (నేపాల్) సందర్శన: సీతాజీ జన్మస్థలం, రామ్ జానకీ దేవాలయం, బక్సర్: రామరేఖ ఘాట్, రామేశ్వరనా...