1 min read

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. […]