Friday, April 18Welcome to Vandebhaarath

Syria News | 50 ఏళ్ల‌ తర్వాత, సిరియాలోకి ప్ర‌వేశించిన ఇజ్రాయెల్.. గోలన్ హైట్స్ స్వాధీనం..

Spread the love

Syria News LIVE Updates | 50 ఏళ్ల తర్వాత, HTS తిరుగుబాటుదారులు సిరియా డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోకి ప్రవేశించింది, ఇది సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను మాస్కోకు పారిపోయిన త‌ర్వాత డమాస్కస్ సమీపంలో ఇజ్రాయెల్ ఆర్మీ ట్యాంకులు కనిపించాయి. ఇజ్రాయెల్ సైన్యం గోలన్ హైట్స్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. ఇది వ్యూహాత్మక విజయంగా చెప్ప‌వ‌చ్చు.

అయితే ఇజ్రాయెల్ చర్య ముస్లిం దేశాలకు కోపం తెప్పించింది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ ఇజ్రాయెల్ చర్యను ‘ప్రమాదకరం’ అని పేర్కొన్నాయి, మరోవైపు, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు సిరియన్ విమానాశ్రయాలు, ఇతర వ్యూహాత్మక మౌలిక సదుపాయాలపై దాడులు చేశాయి. యూదు దేశం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని, సిరియాలో శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నాయి. యూదు దేశం సిరియాపై దాడి చేస్తోంద‌ని సౌదీ అరేబియా ఆగ్ర‌హంవ్య‌క్తం చేసింది. గోలన్ హైట్స్ అరబ్ ప్రపంచానికి చెందింద‌ని, అందుకే ఇజ్రాయెల్ చర్యను ఇతర దేశాలు ఖండించాలని సౌదీ అరేబియా డిమాండ్ చేసింది.

READ MORE  Israel – Palestine Conflict | ఇజ్రాయెల్‌, పాలస్తీనాలో యుద్ధ జ్వాలలు.. 532కి చేరిన మృతుల సంఖ్య

Syria News ఇరాక్ కూడా ఇజ్రాయెల్ ను విమర్శించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిందని పేర్కొంది. సిరియా సాధికారత, సార్వభౌమాధికారం విష‌యంలో రాజీ పడకూడదని ఇరాక్ చెప్పింది. ఐక్యరాజ్యసమితి తన బాధ్యతను నెరవేర్చాలని కోరింది. డిసెంబర్ 8న, ఇజ్రాయెల్ సైన్యం సిరియా లోపల 10 కిలోమీటర్ల దూరంలోకి ప్రవేశించి బఫర్ జోన్‌ను సృష్టించింది. ఇజ్రాయెల్ సిరియా ప్రజలను వారి ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ 1967లో గోలన్ హైట్స్‌ని స్వాధీనం చేసుకుంది. 1974లో ఇజ్రాయెల్, సిరియా మధ్య ఒక ఒప్పందం జరిగింది, ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.

READ MORE  అమెరికా, ఈజిప్ట్ పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *