SCR Special Trains | తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖరులో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశముంది. దీంతో చాలా మంది వివిధ సమ్మర్ వెకేషన్స్ ప్లాన్స్ వేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఇందులో కొన్ని రైళ్లు సికింద్రాబాద్ నుంచి నడవనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పాట్నా-సికింద్రాబాద్ (03253) మధ్య మే 1 నుంచి జూలై 31 వరకు ప్రతీ సోమ, బుధవారాల్లో నడుస్తుంది. హైదరాబాద్ – పాట్నా (07255) రైలు మే 8 నుంచి జూలై 31 వరకు ప్రతీ బుధవారం రాకపోకలు సాగించనుంది.
SCR Special Trains సికింద్రాబాద్ – పాట్నా (07256) స్పెషల్ ట్రైన్ మే 3 నుంచి ఆగస్టు 2 వరకు ప్రతీ సోమవారం అందుబాటులో ఉండనుంది. దానాపూర్ – సికింద్రాబాద్ (03225) మే 5 నుంచి జూలై 25వ తేదీ వరకు ప్రతీ గురువారం, సికింద్రాబాద్ – దానాపూర్ (03226) ప్రత్యేక రైలు మే 5 నుంచి జూలై 28 వరకు ప్రతీ ఆదివారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో తెలిపింది. వీటితో పాటు సికింద్రాబాద్ – దానాపూర్ మధ్య మే నుంచి జూలై వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
Extension of Special train services @RailMinIndia @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/CfiZrrH03U
— South Central Railway (@SCRailwayIndia) April 15, 2024
Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..