Saturday, August 30Thank you for visiting

Special Stories

Special stories and Exclusive stories

పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..

పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..

Special Stories
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ  సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి  వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం.కొన్ని దశాబ్దాల క్రితం వినాయక విగ్రహాలను మట్టి (బంక మట్టి), గడ్డిని వంటి సహజమైన వనరులతో తయారు చేసేవారు. ఆ తర్వాత విగ్రహాన్ని పసుపు వంటి సహజ, సేంద్రియ రంగులతో అలంకరించేవారు కానీ కానీ ప్రస్తుతం POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), థర్మకోల్, ప్లాస్టిక్ వంటి మట్టిలో కలిసిపోని, నీటిలో కరిగిపోని పదార్థాలతో విగ్రహాలను అత్యంత అందంగా రూపొందిస్తున్నారు. కంటికి ఇంపుగా...
ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..

ఒక్కపైసా కూడా అవసరం లేకుండా ఉచిత మూవీ స్ట్రీమింగ్ సైట్‌లు తెలుసా..

Special Stories
ఈ మధ్య కాలంలో మనం సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. తెలియని వెబ్ సైట్ల నుంచి సినిమాలను డౌన్ లోడ్ చేసుకొని చూడాల్సిన అవసతరం లేదు. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరైనా తమకు ఇష్టమైన సినిమాలను చూడటానికి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లలో కొన్ని నెట్‌ఫ్లిక్స్(Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video), డిస్నీ+ హాట్‌స్టార్ (Disney+Hotstar), హులు(Hulu) వంటివి చాలా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ అప్లికేషన్‌లన్నింటినీ ఉపయోగించడానికి, మీరు నెలవారీ, త్రైమాసికం, అర్ధ-వార్షిక లేదా వార్షికంగా చందా చెల్లించాల్సి ఉంటుంది.అయితే ఇప్పుడు, మీరు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే ఉచితంగా సినిమాలను స్ట్రీమింగ్ చేసే ప్లాట్‌ఫారమ్‌లు చాలానే ఉన్నాయని మీకు తెలుసా..? పైగా ఈ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదీ కూడా చట్టవిరుద్ధం కాదు. మీరు రిజిస్ట్రేషన్ లేకు...
మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు

మనదేశంలో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు, విశేషాలు

Special Stories
Top Sri Krishna Temples in India :  శ్రీకృష్ణుడు ప్రపంచంలోని గొప్ప తత్వవేత్త.. విష్ణువుని ఎనిమిదో అవతార పురుషుడు. ప్రపంచమంతా ఆయనను భక్తి ఆరాధనతో పూజిస్తుంది. శ్రీకృష్ణాష్టమి వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక కృష్ణ దేవాలయాలు ఆధ్యాత్మిక పరిమళలాలను ఇనుమడింపజేస్తున్నాయి. భారతదేశం అద్భుతమైన శిల్పకళా వైభవంతో అనేక అందమైన కృష్ణ దేవాలయాలకు నిలయం. శ్రీకృష్ణుని ఆలయాల గురించి తెలుసుకోవడానికి ఈ కథనాన్ని చదవండి. ఇస్కాన్ టెంపుల్, బృందావన్, ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర నగరమైన బృందావన్‌లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ISKCON )  ఇస్కాన్ టెంపుల్ భారతదేశంలోని అత్యంత అందమైన కృష్ణ దేవాలయాలలో ఒకటిగా నిలుస్తుంది. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు, రాధ కొలువుదీరి నిత్యం పూజలందుకుంటారు. ఈ ఆలయంలో అద్భుతమైన శిల్పాలతో పాటు ప...
Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత …

Krishna Janmashtami 2023 : శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత …

Special Stories
Krishna Janmashtami 2023 : హిందువులలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి శ్రీకృష్ణాష్టమి. విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్నిపురస్కరించుకొని ఈ పండుగను జరుపుకుంటారు. భారతదేశమంతటా ఉత్సాహంతో, అత్యంత భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. ఈ పర్వదినాన్ని గోకులాష్టమి, శతమానం ఆటం, శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జయంతి, అష్టమి రోహిణి వంటి విభిన్న పేర్లతో పిలుస్తారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి 2023 కోసం ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ పండుగ ప్రాముఖ్యతను ఒకసారి పరిశీలిద్దాం. శ్రీ కృష్ణ జన్మాష్టమి చరిత్ర శ్రీ కృష్ణ జన్మాష్టమి, హిందూ మతంలో అతి ముఖ్యమైన పండుగ ల్లో ఒకటి. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం (అవతారం) అయిన శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా నిర్వహిస్తుంటారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. ఆయన జీవిత కథ, భగవద్గీత, భాగవత పురాణం వం...
Manipur History: మణిపూర్‌ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?

Manipur History: మణిపూర్‌ చరిత్ర ఏంటో మీకు తెలుసా ?

Special Stories
Manipur History : భారతదేశం ఈశాన్యభాగాన ఉన్న ఏడు రాష్ట్రాల్లో మణిపూర్ ఒకటి. దీని రాజధాని ఇంఫాల్ (Imphal)  మణిపూర్‌లో మెయితీ (meitei) తెగకు చెందినవారు, అలాగే కుకీలు(kuki), నాగా(Naga) తెగలు ప్రధానంగా ఉంటాయి. ఈ రాష్ట్టాన్ని రత్నాల భూమిగా పిలుస్తారు.  మణిపూర్ ఒక సున్నితమైన సరిహద్దు రాష్ట్రంగా భావిస్తారు. కనుక దేశం మిగిలిన ప్రాంతాలలో లేని కొన్ని నిబంధనలు ఇక్కడ అమలవుతున్నాయి.ఇక మణిపూర్ పూర్వ చరిత్రను పరిశీలిస్తే.. ఈ రాష్ట్రం గొప్ప పురాతన చరిత్రను కలిగి ఉంది. క్రీ.శ. 33 నుంచి శతాబ్దాలుగా వందకు పైగా రాజులచే పరిపాలించారు. ఈ ప్రాంతాన్ని వివిధ కాలాలలో వివిధ రాజులు పరిపాలించడమే కాకుండా కాలానుగుణంగా వివిధ పేర్లతో పిలిచారు.మణిపూర్‌ని పిలిచే అనేక పేర్లలో కొన్ని: సన్నా లీపాక్ (Sanna Leipak) టిల్లీ కోక్‌టాంగ్ (Tilli Koktong) పొయిరే లాం (Poirei Lam) మిటే లిపాక్ (Mitei Lipak) మీత్రాబాక్ (Meitraba...
Varalakshmi vratham : వరాలిచే వరలక్ష్మి.. వ్రత కథ, పూజా ఫలితాలు..

Varalakshmi vratham : వరాలిచే వరలక్ష్మి.. వ్రత కథ, పూజా ఫలితాలు..

Special Stories
వరలక్ష్మీవ్రతం.. పూజా విధానం Varalakshmi vratham : శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. ఆగస్టు 25న శుక్రవారం రాష్ట్రమంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా జరుపుకోనున్నారు.మహా మాయారూపిణి, శ్రీపీఠ వాసిని, దేవతలు నిరంతరం సేవించే లోక మాత, శంక, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్టఐశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదలను ప్రసాదించే జగన్మంగళదాయిని, అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీదేవిగా మనం ఆరాధిస్తాం.  పరమ క్తితో పూజించినవారికి, కొలిచిన భక్తులకు కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మిగా కరుణించి కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సువాసినులు వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. వరలక్ష్మీ వ్రత కథ కైలాస గిరిలో పరమేశ్వరుడు తన అనుచరగణంతో, ముని శ్రేష్టులతో ఉండగా పార్వతీదేవి అక్కడికి వచ్చింది. స్వామీ! స్త్రీలు సుఖసౌఖ్యాలు, పుత్ర పౌత్రాదులతో కళకళలాడుతూ ఉం...
అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..

అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం.. ప్రతిరోజూ పండుగలా..

Special Stories
పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇంటిలో ఆధ్యాత్మిక పరిమళాలు వికసిస్తాయి. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా కార్యక్రమాలలతో సందడి నెలకొంటుంది. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా పవిత్రత ఉంటుందనేది వేద పండితుల మాట. ఎంతో గొప్పదైన పవిత్రమాసం ఈ రోజు (ఆగస్టు 17)న ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ మాసంలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు వస్తున్నాయి.సనాతన ధర్మంలో (హిందూ) చంద్ర మానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో ఎంతో పవిత్రత కలిగింది ఈ శ్రావణమాసం. ఈ నెలలో  పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణమాసమని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది.. త్రిమూర్తుల్లో స్థితికారుడు.. దుష్ట శిక్షకుడు.. శిష్ట రక్షకుడైన మహా విష్ణువుకు ఆయన దేవేరి (భార్య) మహా లక్ష్మికి ఈ శ్రావణ మాసం అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫ...
Mizoram History : మార్చి 5, 1966న మిజోరంలో ఏం జరిగింది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఏమిటి?

Mizoram History : మార్చి 5, 1966న మిజోరంలో ఏం జరిగింది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఏమిటి?

Special Stories
ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఈశాన్య ప్రాంత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా 1966లో మార్చి 5న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మిజోరం ప్రజల తిరుగుబాటును నిలువరించేందుకు బాంబుదాడి చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఎంతో మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అసలు ఈ దారుణ ఘటనకు దారి తీసిన పరిణామాలు మిజోరం చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..క్లుప్తంగా.. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) తిరుగుబాటుకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం (IAF) మార్చి 5, 1966న మిజో హిల్స్ (ప్రస్తుత మిజోరం)లోని ఐజ్వాల్ నగరంపై బాంబు దాడి చేసింది. బాంబు దాడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలిచ్చారు. నివేదికల ప్రకారం, ఆహార సంక్షోభం, తీవ్రమైన కరువును ఎదుర్కోవడానికి ఏర్పడిన మిజో నేషనల్ ఫామి...
International Left-Handers Day 2023 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ’

International Left-Handers Day 2023 : ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ’

Special Stories
International Left-Handers Day 2023: ప్రతీ విషయంలో మంచి, చెడు ఉంటాయి. మంచినీ, చెడునీ.. పవిత్రతనూ, అపవిత్రతనూ ఈ కుడి, ఎడమలతోనే పోల్చితే కుడి వైపు మంచిదని, ఎడమవైపు చెడుదని అంటుంటారు. మొదటిసారి ఇంట్లో అడుపెట్టాలనుకుంటే కుడికాలే పెట్టమంటారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కుడి చేతినే అందిస్తుంటాం.. సాధారణ వ్యక్తులు ఏపని చేసినా కుడిచేయితోనే చేస్తుంటారు. కానీ వీరికి భిన్నంగా ఎడమ చేతివాటమున్న వ్యక్తులు చేసే పనులు చాలా విచిత్రంగా, ఇన్ ట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎన్నో సవాళ్లు.. ఎడమ చేతివాటం ఉన్నవారు (Left-Handers) నిత్యజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొన్నపుడు వీరు ఎడమ చేతిలో అన్ని పనులు చేస్తున్నపుడు ఎదుటివారి నుంచి కామెంట్లు వస్తుంటాయి. ఎడమచేతితో షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఎడమ చేతితో భోజనం తింటున్నా, ఎదుటివారికి వడ్డించినా కొంతమంది వీరిని సరిగ్గా అర్థం చేసుకోలేరు. చివరికి కం...
400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..

400కిలోల బరువుతో ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం..

Special Stories
Aligarh: రామమందిరం కోసం ప్రపంచంలోనే అతిపెద్దదైన తాళాన్ని తయారు చేశాడు అలీఘర్ కు చెందిన ఒక రామభక్తుడు సత్య ప్రకాశ్ శర్మ. చేతితో తాళాలను తయారు చేయడంలో ఆయన ప్రసిద్ధి చెందారు. తాజాగా అయోధ్యలోని రామమందిరం కోసం ఏకంగా 400 కిలోల తాళాన్ని రూపొందించారు. రామమందిరం వచ్చే ఏడాది జనవరిలో భక్తుల కోసం ప్రారంభించనుండగా సత్య ప్రకాష్ శర్మ "ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో తయారు చేసిన తాళం" సిద్ధం చేయడానికి నెలల తరబడి కష్టపడ్డారు. దానిని ఈ సంవత్సరం చివర్లో రామ మందిర అధికారులకు బహుమతిగా ఇవ్వాలని యోచిస్తున్నారు.శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారులు మాట్లాడుతూ తమకు చాలా మంది భక్తుల నుండి కానుకలు అందుతున్నాయని, తాళం ఎక్కడ ఉపయోగించాలో చూడాలని అని పేర్కొన్నారు. 45 ఏళ్లుగా 'తాళా నగరి' (taala nagri) లేదా తాళాల భూమి (land of locks) అని కూడా పిలువబడే అలీఘర్‌లో తాళాలు తయారు చేయడంలో తన కుటుంబం ఒక శతాబ్దానికి పై...