
Mahakumbh 2025 : కుంభమేళాను సందర్శిస్తున్నారా? ఈ ఐదు తీసుకురావడం మర్చిపోవద్దు..
Mahakumbh 2025 : హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా వచ్చేసింది. ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు పవిత్ర ఘాట్లకు చేరుకుంటారు. ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళా సందర్భంగా కోట్లాది మంది ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. మహా కుంభం మొదటి రాజ స్నానం జనవరి 14న జరుగుతుందని తెలిసిందే.. మీరు కూడా మహా కుంభమేళాలో పాల్గొని, త్రివేణి ఘాట్‌లో స్నానం చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా ప్రయాగ్‌రాజ్ నుంచి కొన్ని వస్తువులను తీసుకురావాలి. ఈ వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయని వాస్తు దోషాల నుండి ఉపశమనం కలుగుతుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.త్రివేణి సంగమం ఇసుక గంగా ఘాట్ నేల ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మహా కుంభ్‌లో పాల్గొనబోతున్నట్లయితే, మీరు గంగా ఘాట్ ఇంటి నుండి తప్పనిసరిగా పవిత్రమైన మట్టిని తీసుకురావచ్చు. మీరు ఈ మట్టిని తులసి మొక్కలో ...









