Saturday, April 19Welcome to Vandebhaarath

Special Polling Booths | ఓటింగ్ శాతం పెంచేందుకు వినూత్నమైన స్పెషల్, సఖి, ట్రైబల్ థీమ్ పోలింగ్ కేంద్రాలు ఎక్కడో తెలుసా.. ..

Spread the love

Special Polling Booths | లోక్ స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నిక‌ల సంఘం వినూత్న‌మైన కార్య‌క‌మ్రాలు చేప‌డుతోంది. ఇందులో భాగంగా కర్నాటకలో 1800 స్పెష‌ల్‌ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌హిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,120 సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల‌ను పూర్తిగా మ‌హిళ‌లే నిర్వహిస్తారు.

బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో ప్ర‌జ‌లంద‌రూ ఉత్సాహంగా ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. గిరిజనులు, మహిళలు, దివ్యాంగుల‌ను ఓట్లపండుగ‌లో పాల్గొనేలా కర్ణాటకలో ఎన్నికల సంఘం (EC) 1,832 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
షెడ్యూల్డ్ తెగల శాఖ ఈసీ సమన్వయంతో గిరిజన సంస్కృతి నేపథ్యం ఆధారంగా 40 ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తోంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సంప్ర‌దాయ గిరిజ‌న సంస్కృతి క‌నిపించేలా ఈ గిరిజన థీమ్ ఆధారిత పోలింగ్ బూత్‌లను చామరాజనగర్ (9), మైసూరు (9), దక్షిణ కన్నడ (5), శివమొగ్గ (3), ఉడిపి (1), హాసన్ (1), ఉత్తర కన్నడ (5), కొడగు (5), 5) మరియు చిక్కమగళూరు (2) పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా యువత, మహిళలు, వికలాంగులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బూత్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

READ MORE  Jammu And Kashmir | ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం ఎలా సాధ్యమైంది..

స‌ఖి పోలింగ‌ల్ స్టేష‌న్లు..

ఎన్నికలను పండుగలా జరుపుకుంటామని కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ మీనా అన్నారు. సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) కార్యక్రమం కింద ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళా ఓటర్లను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,120 సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసి వాటిని పూర్తిగా మహిళలే నిర్వహిస్తారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కనీసం ఐదు సఖి పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తారు.

READ MORE  SM Krishna: సిలికాన్ సిటీ బెంగళూరును తీర్చిదిద్దడంలో ఎస్ఎం కృష్ణ తెర వెనుక ఏంచేశారు?

అదేవిధంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్‌ను ప్రత్యేకంగా వికలాంగులు పాల్గొనేలా ఏర్పాటు చేస్తారు. ఈ 224 బూత్‌లను ప్రత్యేక అవ‌స‌రాల గ‌ల‌ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ పూర్తిగా యువ అధికారులు, సిబ్బందిచే నిర్వహించనున్నారు. ఈ ప్రాంత సంస్కృతి, ప్రత్యేకతలను ప్రతిబింబించేలా ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక పోలింగ్ బూత్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు.

READ MORE  పాకిస్థాన్‌ను గౌర‌వించండి.. వారి వ‌ద్ద అణుబాంబు ఉంది: దుమారం రేపుతున్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *