Special Trains | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అక్టోబరు వరకు ప్రత్యేక రైళ్ల పొడిగింపు..!
Special Trains | దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం నడుస్తున్న రైళ్లను మరో రెండునెలల పాటు పొడిగించింది. పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- తిరుపతి-అకోల (07605), అకోల-తిరుపతి (07606),
- పూర్ణ-తిరుపతి (07609), తిరుపతి – పూర్ణ (07610),
- హైదరాబాద్ – నర్సాపూర్ (07631), నర్సాపూర్ – హైదరాబాద్ (07632)
- తిరుపతి – సికింద్రాబాద్ (07481), సికింద్రాబాద్ – తిరుపతి (07482),
- కాకినాడ టౌన్ – లింగంపల్లి (07445), లింగంపల్లి – కాకినాడ (07446) Special Trains |ను అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ను పునరుద్ధరించిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు ప్రజల డిమాండ్ కు అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం-లింగంపల్లి (12805), లింగంపల్లి-విశాఖపట్నం (12806) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా ఈ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే.. నిడదవోలు-కడియం సెక్షన్ మధ్య రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను ఈ నెల 25 నుంచి మళ్లీ యథావిధిగా నడిపించనున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే కాకినాడపోర్ట్-చెంగల్పట్టు (17643), చెంగల్పట్టు-కాకినాడపోర్ట్ (17644) మధ్య రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..