బైక్ సీటు కిందే పాము.. బండి స్టార్ట్ చేయబోగా షాక్ : వీడియో
అసలే వర్షాకాలం.. వేసవి ఎండల తర్వాల బొరియల్లో పాములు బయటివచ్చేస్తాయి.. సాధారణంగా ముళ్ల పొదలు.. బొరియలు, రాళ్ల సందులు, పొలాల్లో పాములను తరచూ చూస్తూనే ఉంటాం.. అయితే ఓ పాము మాత్రం ఏం చచక్కా ఓ బైక్ సీటు కిందికి వెళ్లి దాక్కుంది.. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ ను స్టార్ చేశాడు. అయితే ఆ బైక్ నుంచి వింతగా శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.. వివరాల్లోకి వెళితే..
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం బ్రాహ్మణ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లిన ఓ యువకుడు తన బైక్ ను ఇంటి ముందు నిలిపి లోనికి వెళ్లాడు. ఇక తన ఇంటికిబయలుదేరుదామని, బైక్ వద్దకు వచ్చి బైక్ స్టార్ట్ చేసాడు. అంతలోనే లైట్ వెలుతురులో సీటు కింద నుంచి పొడవాటి పాము తోక మెరుస్తూ కనిపించింది. దీంతో కంగు తిన్న అతడు హడలిపోయి బైకును అక్కడే వదిలేసి పక్కకు జరిగాడు. బైక్ యజమాని ఎంత శబ్దం చేసినా పాము బయటకు రాకుండా సీటు కిందనే అలాగే కదలకుండా ఉండిపోయింది.
చుట్టుపక్కల వారు అందరూ వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటకురాలేదు. ఎలాగోలా బైక్ సీటును తొలగించారు. శబ్దాలు చేస్తూ కర్రలతో కదిలించినా కూడా అది బయటికి రాకపోవడంతో ఆ బైకును నెమ్మదిగా కాలనీ చివరి వరకు తోసికెళ్లి కింద పడుకోబెట్టారు. చివరకు నానా తిప్పలు పడి కర్రతో కదిలించడంతో పేద్ద పాము మెల్లగా బైకు నుండి జారుకుని సమీపంలోనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
nbs
p 
ఓ మాత్రం పాము బైక్ సీటు కిందికి వెళ్లి తలదాచుకుంది. ఆ విషయం తెలియక ఓ యువకుడు బైక్ స్టార్ చేశాడు. బైక్ నుంచి వింత శబ్దాలు రావడంతో అనుమానం వచ్చి చూడగా ఒక్కసారిగా షాక్ తిన్నాడు.#snake #Snakeinsideofbike pic.twitter.com/pmcQOm1W1q
— Vande bhaarath (@harithamithra1) June 26,